లైబ్రరీ

అద్భుత ఉపాధి అవకాశాలతో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న రంగం డిజిటల్‌ మీడియా. ఈ రంగంపై వర్ణచిత్రాలతో సమగ్ర సమాచారంతో తెలుగులో రూపొందిన పుస్తకమిది. గ్రాఫిక్‌ డిజైన్‌, 2డీ, 3డీ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, వెబ్‌ అండ్‌ మొబైల్‌ డిజైన్‌,

Published : 01 Aug 2022 00:52 IST

ద్భుత ఉపాధి అవకాశాలతో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న రంగం డిజిటల్‌ మీడియా. ఈ రంగంపై వర్ణచిత్రాలతో సమగ్ర సమాచారంతో తెలుగులో రూపొందిన పుస్తకమిది. గ్రాఫిక్‌ డిజైన్‌, 2డీ, 3డీ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, వెబ్‌ అండ్‌ మొబైల్‌ డిజైన్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫిల్మ్‌మేకింగ్‌ మొదలైన అంశాలను దీనిలో వివరంగా చర్చించారు. డిజిటల్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో విభాగాలవారీగా ఉన్న ఉద్యోగావకాశాలు, స్పెషలైజేషన్లు, కెరియర్‌ సన్నద్ధతకు అవసరమైన చిట్కాలను పొందుపరిచారు. ఈ రంగంలోని స్వల్ప, దీర్ఘకాల కోర్సులు, ఇంటర్న్‌షిప్పుల సమాచారంతో పాటు సంబంధిత నైపుణ్యాలను ఎలా పెంచుకోవాలి, ఈ రంగంలో ఎలా విజయవంతం కావొచ్చు... ఇవన్నీ వివరించారు. డిజిటల్‌ మీడియాలో దశాబ్దాల అనుభవం ఉన్న రచయిత రాజశేఖర్‌ ఈ రంగంపై ఆసక్తి ఉన్న ఫ్రెషర్లకూ, ఐదేళ్ల అనుభవం ఉన్న విద్యార్థులకూ ఉపయోగపడే కరదీపికగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. మల్టీమీడియాలో తరచూ వాడే సాంకేతిక పదాల వివరణ జోడించటం ఓ ఆకర్షణ. అమెజాన్‌లో కూడా ఈ పుస్తకం లభ్యమవుతోంది.  


డిజిటల్‌ మీడియా
(ఆకర్షణీయమైన కెరీర్‌ అవకాశాలు)

పేజీలు: 250; వెల: రూ.1499
రచన: రాజశేఖర్‌ బుగ్గవీటి
ప్రచురణ: క్రియేటివ్‌ మల్టీమీడియా, దిల్‌సుఖ్‌నగర్‌, హైదరాబాద్‌- 500 036
ఫోన్‌: 90525 09052.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని