ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ఇంటర్‌ ఒకేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నీషియన్‌ కోర్సు చేశాను. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉంటుందా?....

Published : 02 Aug 2022 01:55 IST

నేను ఇంటర్‌ ఒకేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నీషియన్‌ కోర్సు చేశాను. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉంటుందా?

- ఆనంద్‌

జ: మీకు ఇంటర్‌ కనీస అర్హత ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కచ్చితంగా అర్హత ఉంటుంది. అన్నింటికీ బాగా ప్రిపేర్‌ అవ్వండి.

నా మీద సెక్షన్‌ 306, 506, 363 ళి/జూ 24 కింద 2016లో కేసు నమోదైంది. 2018లో హైకోర్టులో రాజీ కుదిరింది. 2019లో జరిగిన పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో అర్హత సాధించాను. కానీ, తిరస్కరించారు. ఈసారి కూడా పరీక్షలో అర్హత సాధిస్తే నన్ను తిరస్కరిస్తారా? నాకు ఏ ప్రభుత్వ ఉద్యోగానికీ అర్హత లేదా?

- ఒక అభ్యర్థి

జ: మీరు తెలిపిన వివరాల ప్రకారం రాజీ కుదిరి, శిక్ష పడలేదు. కాబట్టి మీకు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. న్యాయసలహా తీసుకొని ప్రయత్నించవచ్చు.

నేను తెలంగాణ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. ఇటీవలే లాగిన్‌ అవుదామంటే ఇన్‌వ్యాలిడ్‌ అని వస్తోంది. సమస్యకు పరిష్కార మార్గాన్ని తెలియజేయండి.

- శ్రవణ్‌

జ: ఆధార్‌ నంబరు లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ (పుట్టిన తేదీ, సంవత్సరం, నెల) వివరాలతో ప్రయత్నించి చూడండి.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

ఏ సబ్జెక్టునూ యాంత్రికంగా చదవకూడదు. అర్థం చేసుకుంటూ, అంశాలను ప్రశ్నించుకుంటూ అధ్యయనం చేయాలి. అప్పుడే ప్రశ్నలు ఎలా వచ్చినా సమాధానాలు రాయగలుగుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని