కరెంట్‌ అఫైర్స్‌

భారత వాయుసేనలో యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన మొదటి తండ్రీ కూతుళ్లుగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు?

Published : 02 Aug 2022 01:55 IST

మాదిరి ప్రశ్నలు

* భారత వాయుసేనలో యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన మొదటి తండ్రీ కూతుళ్లుగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు?
జ:
ఎయిర్‌ కమొడోర్‌ సంజయ్‌ శర్మ, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ అనన్య శర్మ

* హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎన్‌పీఏ) డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ:
ఎ.ఎస్‌.రాజన్‌

* 2020 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సులభతర వాణిజ్య విధానం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో ఎంత స్కోరు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి వరుసలో నిలిచింది?
జ:
94.86 శాతం
* కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు ఎంత?
జ:
రూ.133.22 లక్షల కోట్లు

* ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలైన (86 ఏళ్లు) ఫ్లైట్‌ అటెండెంట్‌గా గిన్నిస్‌ రికార్డు సృష్టించిన అమెరికా వృద్ధురాలు ఎవరు?
జ:  బెట్టెనాష్‌

విద్యుత్‌ అవసరం లేకుండా ఏసీ అనుభూతి ఇచ్చేలా రేడియేటివ్‌ కూలర్‌ అనే కోటింగ్‌ పదార్థాన్ని ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేశారు?
జ: గువాహటి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఏర్పాటు చేసిన వాట్సాప్‌ ఫిర్యాదుల విభాగం ఫోన్‌ నంబరు ఎంత?
జ:
94905 55533


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని