ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. గతంలో ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే అర్హత సాధించాను. నాకు పుస్తౖకాలు చదవడం పెద్దగా ఆసక్తి అనిపించదు

Published : 03 Aug 2022 02:04 IST

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. గతంలో ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే అర్హత సాధించాను. నాకు పుస్తౖకాలు చదవడం పెద్దగా ఆసక్తి అనిపించదు. వార్తా పత్రికల్లోని సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రిపేర్‌ అవుతున్నాను. గ్రూప్‌-2 లాంటి పోటీ పరీక్షలకు ఈ సమాచారం సరిపోతుందా?

- ఎస్‌. పవన్‌

జ: వార్తా పత్రికల్లోని సమాచారం ఒకటే సరిపోదు. దాంతో పాటు గ్రూప్‌-2 సిలబస్‌ ఆధారంగా రూపొందిన ప్రామాణిక పుస్తకాలను కచ్చితంగా చదవాల్సి ఉంటుంది. కరెంట్‌ అఫైర్స్‌కి వార్తాపత్రిల్లోని సమాచారం ఉపయోగపడుతుంది.


నేను ఇంటర్‌  ఒకేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తి చేశాను. నాకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లోని ఏయే ఉద్యోగాలకు అర్హత ఉంది? 

  - దినేష్‌ గౌడ్‌

జ: గ్రూప్‌-4, కానిస్టేబుల్‌ తదితర ఉద్యోగాలు అంటే ఇంటర్‌ అర్హతతో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://tinyurl. com/tn54p9mj లింక్‌ క్లిక్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని