Published : 03 Aug 2022 02:04 IST

కరెంట్‌ అఫైర్స్‌

మాదిరి ప్రశ్నలు

* వింబుల్డన్‌-2022 పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ విజేతగా నోవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) నిలిచాడు. ఇతడి కెరీర్‌ మొత్తం మీద ఇది ఎన్నో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌?
జ: 21

* తెలంగాణలో పచ్చదనం పునరుద్ధరణలో భాగంగా యూకలిప్టస్‌ (జామాయిల్‌) తోటల స్థానంలో ఏ మొక్కల సాగుకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది?
జ: శ్రీగంధం, ఎర్రచందనం

* 17వ ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) మహాసభలను 2022, జులై 1 - 3 తేదీల్లో ఎక్కడ నిర్వహించారు?
జ: వాషింగ్టన్‌ డీసీ

* ఏ దేశానికి చెందిన బహుళజాతి సంస్థ శాఫ్రాన్‌ రూ.1200 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లో తమ అతిపెద్ద, తొలి ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ మొయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌ఆల్‌ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
జ: ఫ్రాన్స్‌

* శ్రీలంక అధ్యక్షుడి అధికార నివాసం పేరు?
జ: ప్రెసిడెంట్స్‌ హౌస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని