కరెంట్‌ అఫైర్స్‌

అత్యంత శక్తిమంతమైన కే-329 బెల్గొరోడ్‌ అనే జలాంతర్గామి (ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత బరువైన, పొడవైన సబ్‌ మెరైన్‌)ని ఏ దేశం ఇటీవల నావికాదళంలో ప్రవేశపెట్టింది?

Published : 04 Aug 2022 03:39 IST

మాదిరి ప్రశ్నలు

* అత్యంత శక్తిమంతమైన కే-329 బెల్గొరోడ్‌ అనే జలాంతర్గామి (ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత బరువైన, పొడవైన సబ్‌ మెరైన్‌)ని ఏ దేశం ఇటీవల నావికాదళంలో ప్రవేశపెట్టింది?
జ: రష్యా

* ఏ రాష్ట్రంలోని అమరావతి, అకోలా జిల్లాల మధ్య కేవలం 105 గంటల, 33 నిమిషాల వ్యవధిలో 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేసి ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) గిన్నిస్‌ రికార్డు పొందింది?
జ: మహారాష్ట్ర

* మోడర్న్‌ మెడిసిన్‌ను ప్రాక్టీస్‌ చేస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎమ్‌సీ) చట్టం, 2019లో రిజిస్టరైన ప్రాక్టీషనర్లు (ఆర్‌ఎమ్‌పీలు) తమ పేర్లకు ముందు ఏమని చేర్చుకోవచ్చని ఎన్‌ఎమ్‌సీ కీలక ప్రతిపాదన చేసింది?
జ: మెడికల్‌ డాక్టర్‌

* సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ప్రస్తుత ఛైర్‌పర్సన్‌ ఎవరు?
జ: మాధబి పురీ బచ్‌

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంతర్జాతీయ అభివృద్ధి అంచనాలను 4.1 శాతం నుంచి ప్రపంచ బ్యాంకు ఇటీవల ఎంతకు తగ్గించింది?
జ: 2.9 శాతం

* దేశంలో 101వ యూనికార్న్‌గా గుర్తింపు పొందిన ‘ఫిజిక్స్‌ వాలా’ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎవరు?
జ: అలఖ్‌ పాండే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని