ప్రాక్టీస్‌ ప్రశ్నలు

వస్తువు ఏ రకమైన చలనంలో ఉంటే అభికేంద్ర బలం పనిచేస్తుంది?

Published : 04 Aug 2022 03:47 IST

జనరల్‌ సైన్స్‌ - ఫిజిక్స్‌

1. వస్తువు ఏ రకమైన చలనంలో ఉంటే అభికేంద్ర బలం పనిచేస్తుంది?
  1) వృత్తాకార చలనం       2) రేఖీయ చలనం
  3) కంపన చలనం         4) ఏదీకాదు

2. వాయువులో ధ్వని వేగం మార్పు చెందకపోవడానికి కారణం?
  1) ఉష్ణోగ్రత    2) తేమ శాతం    3) పీడనం   4) ఏదీకాదు

3. కాస్మిక్‌ శబ్దం (కాస్మిక్‌ నాయిస్‌) దేనివల్ల  ఏర్పడుతుంది?
  1) మెరుపులు, ఉరుములు  2) సౌర ఉద్గారం
  3) సుదూర నక్షత్రాలు      4) పరిశ్రమలు

4. కేంద్రక వ్యాసార్ధానికి ప్రమాణం ఏది?
  1) ఆంగ్‌స్ట్రామ్‌         2) మైక్రాన్‌  
  3) నానోమీటర్‌         4) ఫెర్మీ

5. 93.5 MHz దేన్ని సూచిస్తుంది?
  1) పౌనఃపున్యం         2) తరంగదైర్ఘ్యం
  3) వేగం               4) ద్రవ్యరాశి

6. ఘనపదార్థాల్లో ధ్వని ఏ రూపంలో ప్రసరిస్తుంది?
  1) తిర్యక్‌ తరంగ రూపం  
  2) అనుదైర్ఘ్య తరంగ రూపం
  3) 1, 2             4) ఏదీకాదు

7. సైనికులు వంతెనపై కవాతు చేసేటప్పుడు అది కూలిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని వివరించేది?
  1) అనునాదం              2) ప్రతిధ్వని
  3) విధ్వంసక వ్యతికరణం   4) వివర్తనం

8. ‘కెలిడియోస్కోప్‌’ ఏ సూత్రం ఆధారంగా పని చేస్తుంది?
  1) పరావర్తనం       2) వక్రీభవనం
  3) విక్షేపణం        4) సంపూర్ణాంతర పరావర్తనం

సమాధానాలు: 1-1; 2-3; 3-3; 4-4; 5-1; 6-2; 7-1; 8-1.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని