ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌లో నాన్‌ క్రీమీ లేయర్‌ సర్టిఫికెట్‌కు బదులు కుల ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్‌ చేశాను. మళ్లీ సరిచేసే అవకాశం ఉంటుందా?

Published : 06 Aug 2022 05:34 IST

నేను టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌లో నాన్‌ క్రీమీ లేయర్‌ సర్టిఫికెట్‌కు బదులు కుల ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్‌ చేశాను. మళ్లీ సరిచేసే అవకాశం ఉంటుందా?

కరుణాకర్‌

జ: ఓటీఆర్‌లోని ఎడిట్‌ ఆప్షన్‌కి వెళ్లి సరి చేసుకోవచ్చు.

ఇటీవల నేను తెలంగాణ ఎస్‌ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. ఆ సమయానికి నా వయసు 35 సంవత్సరాల 3 నెలలు. బీసీ-ఎ కేటగిరీ అభ్యర్థిని. ప్రభుత్వం ప్రకటించిన వయసు సడలింపు ప్రకారం నాకు ఎస్‌ఐ ఉద్యోగానికి అర్హత ఉందా?

- సాయి చేతి

జ: మీ వయసు 35 సంవత్సరాలు దాటిన కారణంగా అర్హత ఉండదు. మీరు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ప్రస్తుతం పని చేస్తుంటే అర్హత ఉంటుంది.

నేను ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని. టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌లో నా సర్వీస్‌ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయమని సందేశం వచ్చింది. కానీ, నా దగ్గర ఆ సమయానికి  సర్టిఫికెట్‌ లేకపోవడంతో ఉద్యోగ ఐడీ కార్డును అప్‌లోడ్‌ చేశాను. దాని వల్ల నా గ్రూప్‌-1 దరఖాస్తును ఏమైనా తిరస్కరిస్తారా?

- ప్రవీణ్‌కుమార్‌ నాగమల్ల

జ: మీ దరఖాస్తును తిరస్కరించరు. టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌లో సరిచేసుకునే అవకాశం ఉంది కాబట్టి, సర్వీస్‌ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని