Published : 12 Aug 2022 02:26 IST

ప్రాక్టీస్‌ ప్రశ్నలు

జనరల్‌ సైన్స్‌ - బయాలజీ

1. వృక్షరాజ్యంలో ఏ విభాగం జీవులు అత్యంత పరిణతి చెందినవి?
  1) టెరిడోఫైటా          2) ఆవృత బీజాలు  
  3) వివృత బీజాలు       4) థాలోఫైటా

2. స్వయంపోషక థాలోఫైటా జీవులైన శైవలాల అధ్యయనాన్ని ఏమంటారు?
 1) ఫైకాలజీ           2) ఆల్గాలజీ                                      
 3) ఎకాలజీ           4) ఆర్నిథాలజీ

3. ఏ శైవలంలో అత్యధిక ప్రొటీన్‌లు ఉంటాయి?
  1) క్లోరెల్లా          2) స్పైరోగైరా  
  3) స్పైరులీనా       4) రోడిమియా

4. శైవలాల కణకవచం ఏ పదార్థంతో నిర్మితమవుతుంది?
  1) సెల్యులోజ్‌       2) ఖైటిన్‌  
  3) సుక్రోజ్‌          4) పెక్టిన్‌

5. విటమిన్‌లు, ఖనిజ లవణాలు పుష్కలంగా కలిగిన ఆహార యోగ్యమైన శిలీంధ్రాలు?
  1) ఈస్ట్‌లు           2) పెన్సిలియం
  3) పుట్టగొడుగులు     4) రైజోపస్‌లు

6. రైజోపస్‌ శిలీంధ్రాన్ని ఏ పేర్లతో పిలుస్తారు?
  1) బ్రెడ్‌మోల్డ్‌                    2) బ్లాక్‌మోల్డ్‌
  3) ప్రయోగశాల కలుపు మొక్క    4) పైవన్నీ

7. శైవలం, శిలీంధ్రం కలిసి ఏర్పర్చిన జీవిని ఏమంటారు?
  1) లైకెన్‌    2) పెన్సిలియం   3) అగారికస్‌   4) ఈస్ట్‌

8. వృక్షరాజ్య ఉభయజీవులు అని ఏ మొక్కలను అంటారు?
1) శైవలాలు         2) శిలీంధ్రాలు
3) బ్రయోఫైటా       4) ఆవృత బీజాలు

9. ఫైర్‌మాస్‌ అని ఏ బ్రయోఫైటా మొక్కను అంటారు?
  1) ఫ్యునేరియా       2) రిక్సియా
  3) మార్కాంషియా   4) స్పాగ్నమ్‌

సమాధానాలు: 1-2, 2-1, 3-3, 4-2, 5-3, 6-4, 7-1, 8-3, 9-1.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts