కరెంట్‌ అఫైర్స్‌

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?

Published : 12 Aug 2022 02:26 IST

మాదిరి ప్రశ్నలు

* ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?
జ: రుచిరా కాంబోజ్‌


* దేశంలోనే తొలిసారిగా ఏ నగర మెట్రో రైల్వేలో భాగంగా అండర్‌ వాటర్‌ మెట్రోను 2023 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించారు?                        
జ: కోల్‌కతా


* తెలంగాణలో జీవవైవిధ్యంతో సరికొత్తగా ఎన్ని థీమ్‌ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ సంకల్పించింది?
జ: 75

* గడిచిన ఏడేళ్లలో ఎంతమంది భారత పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు వెళ్లిపోయినట్లు కేంద్ర హోంశాఖ పార్లమెంటులో ప్రకటించింది?                
జ: 9.5 లక్షల మంది


* స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (సెజ్‌) యూనిట్లలో పనిచేసే సిబ్బంది కోసం కేంద్ర వాణిజ్య శాఖ నూతన వర్క్‌ ఫ్రం హోమ్‌ రూల్స్‌ను రూపొందించింది. ఈ రూల్స్‌ ప్రకారం ఉద్యోగి గరిష్ఠంగా ఎంత కాలంపాటు ఇంటి నుంచి పనిచేయవచ్చు?
జ: ఏడాది

* 2013-14లో రూ.24,878 కోట్లుగా ఉన్న తెలంగాణ పశుసంపద విలువ 2021-22 నాటికి ఎంత మొత్తానికి పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి? 
జ: రూ.94,400 కోట్లు

* తెలంగాణ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ (టీఎస్‌ రెడ్‌ కో) ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ: వై. సతీష్‌రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని