కరెంట్‌ అఫైర్స్‌

2022 కామన్వెల్త్‌ క్రీడల్లో టీ20 క్రికెట్‌లో భారత మహిళల జట్టు ఏ పతకం నెగ్గింది?

Published : 13 Aug 2022 04:18 IST

మాదిరి ప్రశ్నలు

2022 కామన్వెల్త్‌ క్రీడల్లో టీ20 క్రికెట్‌లో భారత మహిళల జట్టు ఏ పతకం నెగ్గింది?

జ: రజతం

షూటింగ్‌ ప్రపంచకప్‌-2022 ను ఏ దేశంలోని చాంగ్వాన్‌లో నిర్వహించారు?      

జ: దక్షిణ కొరియా

2022 జులై 28 నుంచి ఆగస్టు 10 వరకు 44వ ఫిడే అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలను ఎక్కడ నిర్వహించారు?

జ: చెన్నై

అంటార్కిటిక్‌లో జీవ వైవిధ్యాన్ని, వాతావరణాన్ని కాపాడటానికి, అక్కడి మన పరిశోధన సంస్థలను భారత చట్టాల పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఇండియన్‌ అంటార్కిటిక్‌ బిల్లు-2022 కు లోక్‌సభ ఏ రోజున ఆమోదం తెలిపింది?

జ: 2022, జులై 22

శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా 2022, జులై 22న ఎవరు  ప్రమాణ స్వీకారం చేశారు?

జ: దినేశ్‌ గుణవర్ధన

కాకతీయుల పరిపాలన నాటి చరిత్ర, సంస్కృతి, జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలిపే ఫొటోలతో తెలంగాణ పర్యాటక శాఖ కాఫీ టేబుల్‌ బుక్‌ను రూపొందించాలని నిర్ణయించింది. దీన్ని ఎన్ని ఫొటోలతో రూపొందిస్తున్నారు?

జ: 777

2022-23 ఆర్థిక సంవత్సరానికి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్య యోజన పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?

జ: రూ.90.23 కోట్లు

రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లోని విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం?

జ: తొలిమెట్టు

ఏ దేశం నుంచి ఆఫ్రికన్‌ చిరుతలను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది?

జ: నమీబియా, దక్షిణాఫ్రికా


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

సబ్జెక్టులను ఒకటికి  రెండుసార్లు రివిజన్‌ చేయాలి.అది కూడా ప్రణాళిక  ప్రకారం జరగాలి. పరీక్ష తేదీ సమీపిస్తున్నప్పుడు మార్కుల వెయిటేజీ క్రమంలో చాప్టర్లను రివిజన్‌ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని