ప్రాక్టీస్‌ బిట్లు

1929లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశానికి ఎవరు అధ్యక్షత  వహించారు?

Published : 14 Aug 2022 02:29 IST

భారతదేశ చరిత్ర

1. 1929లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశానికి ఎవరు అధ్యక్షత  వహించారు?
  1) మోతీలాల్‌ నెహ్రూ    2) జవహర్‌లాల్‌ నెహ్రూ
  3) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌    4) గాంధీజీ

2. గాంధీజీ దండియాత్రను ఏ రోజున ప్రారంభించారు?
  1) 1930, మార్చి 6    2) 1930, మార్చి 12
  3) 1930, ఏప్రిల్‌ 6           4) 1930, ఏప్రిల్‌ 12

3. తమిళనాడులో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించినవారు?
1) సి.రాజగోపాలాచారి
2) పెరియార్‌
3) కరుణానిధి   4) మూపనార్‌

4. ఈశాన్య రాష్ట్రాల్లో శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించినవారు?
  1) రాణి గైడిన్‌ ల్యూ 2) ఇరోం షర్మిల
  3) చందర్‌ మీనన్‌         4) పద్మనాభ పిళ్లై

5. ఖుదై ఖిద్మత్‌ గార్స్‌ దళాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
  1) మహమ్మద్‌ అలీ జిన్నా      2) ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌
3) మహమ్మద్‌ అలీ      4) మౌలానా అబుల్‌కలామ్‌

6. ఢాకాలో శాసనోల్లంఘన ఉద్యమంలో ఏయే వర్గాలు పాల్గొన్నాయి?
  1) ముస్లిం నాయకులు, బలహీనవర్గాలు 2) ముస్లిం నేత పనివారు
  3) రైతులు, షెడ్యూల్డ్‌ కులాలవారు    4) రైతులు, నేత పనివారు

7. మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరైన ఇండియన్‌ లిబరల్‌ ఫెడరేషన్‌ నాయకుడు?
  1) తేజ్‌ బహదూర్‌ సప్రూ       2) జయకర్‌
  3) బి.ఆర్‌. అంబేడ్కర్‌   4) ఆగాఖాన్‌


సమాధానాలు: 1-2; 2-2; 3-1; 4-1; 5-2; 6-1; 7-1.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని