కరెంట్‌ అఫైర్స్‌

వినోద రంగంలో ఐదేళ్లుగా అత్యంత ఎక్కువగా పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా ఎవరు వార్తల్లో నిలిచారు?

Published : 16 Aug 2022 01:48 IST

మాదిరి ప్రశ్నలు

వినోద రంగంలో ఐదేళ్లుగా అత్యంత ఎక్కువగా పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా ఎవరు వార్తల్లో నిలిచారు?

జ: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌

తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి ఎవరు?

జ: దీపికా రెడ్డి  

తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విద్యాసంస్థలకు టీ-ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ కనెక్షన్‌లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?

జ: 30 వేలు

గ్రామ పంచాయతీలు పెట్టే ఖర్చుల వివరాలను ఆన్‌లైన్‌ ఆడిట్‌ నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్ని వరుసగా రెండోసారి నేషనల్‌ లీడ్‌ స్టేట్‌గా ప్రకటించింది?

జ: తెలంగాణ

ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ఆహార వృథా సూచిక-2021 ప్రకారం అత్యధికంగా ఆహారాన్ని వృథా చేస్తున్న దేశాల్లో ఏవి తొలి రెండు స్థానాల్లో నిలిచాయి?

జ: చైనా, భారత్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని