Published : 18 Aug 2022 04:10 IST

పర్యావరణం ప్రాక్టీస్‌ బిట్లు

1. ఆమ్ల వర్షానికి కారణమైన ప్రధాన వాయువు?
  1) సల్ఫర్‌ డై ఆక్సైడ్‌   2) కార్బన్‌ డై ఆక్సైడ్‌
  3) నైట్రోజన్‌ ఆక్సైడ్‌   4) కార్బన్‌ మోనాక్సైడ్‌

2. ఆమ్ల వర్షాలను నియంత్రించడానికి ఏ ప్రక్రియ ఎక్కువగా ఉపయోగపడుతుంది?
  1) పెట్రోల్‌, డీజిల్‌ లాంటి వాటిని డీసల్ఫరైజేషన్‌ చేయడం.
  2) చెట్లను పెద్ద ఎత్తున నాటడం.
  3) గృహ వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండటం.
  4) చెత్తను కంపోస్ట్‌గా మార్చడం.

3. ఎంత గాఢత ఉన్న వర్షపు నీటిని ఆమ్ల వర్షంగా పిలుస్తారు?  
  1)ph 10       3) ph 5.7    
  2) ph 11     4) ph 12

4. కాలుష్య కారకాల వల్ల గాలిలో ఏర్పడిన ఆమ్లాలు ఏ రూపంలో భూమిని చేరతాయి?
  1) ఆమ్ల వర్షం         2) ఆమ్లయుత మంచు  
  3) ఆమ్లయుత ధూళి, పొగమంచు   4) పైవన్నీ

5. జలావరణ వ్యవస్థను దెబ్బతీసే ఆమ్ల వర్షాలను ఏమని పిలుస్తారు?
  1) లేక్‌ పొల్యూటర్స్‌   2) లేక్‌ సేవర్స్‌
  3) లేక్‌ కిల్లర్స్‌       4) లేక్‌ డైల్యూటర్స్‌

6. ఆమ్ల వర్షం వల్ల నేలలో ఎలాంటి మార్పులు కలుగుతాయి?
  1) భార లోహాలు కొట్టుకుపోతాయి.  
  2) నేలలోని సూక్ష్మజీవులు చనిపోతాయి.
  3) నేల సారం దెబ్బతింటుంది.     4) పైవన్నీ

7. ఆమ్ల వర్షం వల్ల నీటి ఆవరణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు కలుగుతాయి?
  1) నీటిలో తీవీదీ పెరుగుతుంది.  
  2) చేపలు, ఇతర జీవులు చనిపోతాయి.
  3) నీటి కాలుష్యం జరుగుతుంది.   4) పైవన్నీ

8. చేపలు పెద్ద ఎత్తున చనిపోయి చెరువులు చేపల శ్మశానాలుగా మారడానికి కారణం?
  1) యూట్రోఫికేషన్‌      2) ఆమ్ల వర్షం
  3) తీవీదీ తగ్గడం      4) ఆక్సిజన్‌ పెరగడం


సమాధానాలు: 1-1; 2-1; 3-2; 4-4; 5-3; 6-4; 7-4; 8-2.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని