కరెంట్‌ అఫైర్స్‌

ఎవరెస్ట్, మకాలు పర్వతాలను కేవలం 16 రోజుల్లోనే అధిరోహించిన తొలి భారత మహిళగా ఎవరు వార్తల్లో నిలిచారు? 

Published : 20 Aug 2022 02:47 IST

మాదిరి ప్రశ్నలు

ఎవరెస్ట్, మకాలు పర్వతాలను కేవలం 16 రోజుల్లోనే అధిరోహించిన తొలి భారత మహిళగా ఎవరు వార్తల్లో నిలిచారు? 

జ: సవిత కంజ్వాల్‌

విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన గెలాక్సీల్లో అత్యంత పురాతనమైన గెలాక్సీని జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌ ఇటీవల ఫొటో తీసింది. ఈ గెలాక్సీ పేరు ఏమిటి?

జ: గ్లాస్‌-జడ్‌ 13

భూమిపై ఉన్న 95 శాతానికి పైగా సరస్సులు, నదుల సమాచారం, వాటి నైసర్గిక స్వరూపాన్ని అత్యంత కచ్చితత్వంతో లెక్కగట్టే ఏ ఉపగ్రహాన్ని అమెరికా, ఐరోపా దేశాలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి?

జ: స్వాట్‌

మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ - 2022 టైటిల్‌ను నెగ్గిన బ్రిటన్‌లోని భారత సంతతి యువతి ఎవరు?

జ: ఖుషీ పటేల్‌

రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఏ ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?

జ: ఫ్లిప్‌ కార్ట్‌

సూర్యరశ్మితో సంబంధం లేకుండా మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునేలా నూతన ప్రక్రియ (కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ)ను ఏ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు?

జ: కాలిఫోర్నియా యూనివర్సిటీ

2020-21లో దేశంలో 716.083 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయిందని, 2021-22లో అది ఎంతకు పెరిగినట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ 2022 జులైలో రాజ్యసభలో ప్రకటించారు?

జ: 778.19 మిలియన్‌ టన్నులు

2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలు, డీజిల్‌ రేట్లను వరుసగా ఎన్నిసార్లు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో  ప్రకటించింది?

జ: 78 సార్లు, 76 సార్లు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని