కరెంట్‌ అఫైర్స్‌

నార్వేలోని ఓస్లోలో 2022 జులై 11, 12 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌ (ఐఎంవో)లో మూడు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన బెంగళూరు....

Published : 21 Aug 2022 02:07 IST

మాదిరి ప్రశ్నలు

* నార్వేలోని ఓస్లోలో 2022 జులై 11, 12 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌ (ఐఎంవో)లో మూడు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన బెంగళూరు విద్యార్థి ఎవరు?    
జ:
ప్రాంజల్‌ శ్రీవాస్తవ

* దేశీయ సంస్థలైన టెక్‌ మహీంద్ర, జెనిసిస్‌లతో కలిసి గూగుల్‌ మ్యాప్స్‌ 2022 జులైలో ఎన్ని నగరాల్లో స్ట్రీట్‌ వ్యూ సేవలను ప్రారంభించింది?
జ:
10 నగరాలు

* ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?            
జ:
జులై 28

* 2015తో పోలిస్తే 2022 నాటికి తెలంగాణలో అడవులు ఎంత శాతం మేర పెరిగినట్లు ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక పేర్కొంది?
జ:
7.7 శాతం

* రష్యా అంతరిక్ష సంస్థ ‘రొస్కొస్మోస్‌’ నూతన అధిపతిగా 2022 జులైలో ఎవరు నియమితులయ్యారు?                        
జ:
యూరీ బోరిసోవ్‌

* అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి 2024 తర్వాత బయటకు రావాలని ఏ దేశం నిర్ణయం తీసుకుంది? (ఐఎస్‌ఎస్‌ను అమెరికా, రష్యా, జపాన్‌, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి)
జ:
రష్యా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని