కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థిక వేత్తగా నియమితులైన రెండో భారతీయుడిగా ఎవరు వార్తల్లో నిలిచారు? (ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడు కౌశిక్‌ బసు)     

Published : 30 Aug 2022 02:21 IST

మాదిరి ప్రశ్నలు

* ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థిక వేత్తగా నియమితులైన రెండో భారతీయుడిగా ఎవరు వార్తల్లో నిలిచారు? (ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడు కౌశిక్‌ బసు)              
జ: ఇందర్‌మిత్‌ గిల్‌

* 8 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న అయిదు శిఖరాలను అధిరోహించిన తొలి భారత మహిళగా ఎవరు ఘనత సాధించారు?
జ: ప్రియాంక మోహితే
* హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత)గా ఎవరు నియమితులయ్యారు?
జ: స్వాగత్‌ దాస్‌
* గృహహింసకు గురవుతున్న మహిళలకు తక్షణ సాయం కోసం కేంద్రం అందుబాటులోకి తెచ్చిన 181 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం నుంచి అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్నట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది?

  జ: దిల్లీ
*అధిక సాంద్రత విధానంలో పత్తిని సాగు చేసే రైతులకు పెట్టుబడి ఖర్చు కోసం ఒక్కొక్కరికి ఎంత మొత్తం ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది?
జ: రూ.4 వేలు
* జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ సీట్ల పునర్విభజనపై ఏర్పాటు చేసిన ఏ త్రిసభ్య కమిటీ తన తుది నివేదికలో కశ్మీర్‌ డివిజన్‌కు 47, జమ్మూ డివిజన్‌కు 43 స్థానాలను ప్రతిపాదించింది?                            
జ: సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి  జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ కమిటీ

* ఏ దేశంలో 1600 అడుగుల ఎత్తు, 120 కి.మీ. పొడవు, రూ.76,600 కోట్లతో నిర్మించనున్న జంట ఆకాశహర్మ్యాలకు సంబంధించిన ప్లాన్‌ను ఇటీవల ఆ దేశ రాకుమారుడు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ విడుదల చేశారు? 

 జ: సౌదీ అరేబియా
* తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారం చేపట్టి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2022 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సమగ్ర విశ్లేషణ ప్రగతి నివేదిక ప్రకారం ఆరోగ్యశ్రీ పథకం అమలుకు ఈ ఎనిమిదేళ్లలో ఎంత మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చించింది?                                        
జ: రూ. 5,817 కోట్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని