ఐఐటీ మద్రాస్‌ గురించి తెలుసుకోవాలా?

ఐఐటీ మద్రాస్‌... దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా ర్యాంకింగ్స్‌లో ఎప్పుడూ ముందుంటుంది. లక్షల మంది విద్యార్థులు అందులో చేరాలని ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలో వారికి ఎన్నో సందేహాలు ఉండటం సహజం. ఆన్‌లైన్‌లో లభించే రకరకాలైన సమాచారంతో మరింత గందరగోళానికి గురికాకుండా

Updated : 31 Aug 2022 05:48 IST

ఐఐటీ మద్రాస్‌... దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా ర్యాంకింగ్స్‌లో ఎప్పుడూ ముందుంటుంది. లక్షల మంది విద్యార్థులు అందులో చేరాలని ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలో వారికి ఎన్నో సందేహాలు ఉండటం సహజం. ఆన్‌లైన్‌లో లభించే రకరకాలైన సమాచారంతో మరింత గందరగోళానికి గురికాకుండా... ఐఐటీ-మద్రాస్‌ పూర్వవిద్యార్థులు ఓ కొత్త ఆలోచనకు రూపునిచ్చారు. www.askiitm.com పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దీనిలో ఎవరైనా సరే, ఈ సంస్థకు సంబంధించిన ఏ విషయం గురించైనా ప్రశ్నలు అడగొచ్చు. వాటికి 48 గంటల్లోగా పూర్వవిద్యార్థులు జవాబులు ఇస్తారు. క్యాంపస్‌, ప్లేస్‌మెంట్స్‌, ఫ్యాకల్టీ, అకడమిక్స్‌... ఇలా దేని గురించైనా అభ్యర్థులు తమ సందేహాలు అడిగి నివృత్తి చేసుకోవచ్చు. అభ్యర్థులకు కచ్చితమైన సమాచారం తెలియాలనే ఆశయంతో దీన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు... జేఈఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న వారికోసం సెప్టెంబర్‌ 2, 4 తేదీల్లో చెన్నై, హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు దీనికి హాజరై పూర్వవిద్యార్థులు, డైరెక్టర్‌ను తమ ప్రశ్నలు నేరుగా అడగవచ్చు. అలాగే సెప్టెంబర్‌ 10, 11 తేదీల్లో క్యాంపస్‌ వర్చువల్‌ టూర్లు నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని