ఎవరు ఎవరికి ఏమవుతారో!

ఆత్మీయమైన అమ్మ, అనురాగంతో నాన్న, ఆప్యాయంగా అక్క, అన్నివేళలా అండగా నిలిచే అన్న, చెదరని ప్రేమతో చెల్లి, తరగని ఆదరణతో తమ్ముడు.. అందరి జీవితాల్లోనూ ఉండే బంధాలు. అవి ఎప్పటికీ విడిపోని రక్తసంబంధాలు.

Updated : 07 Sep 2022 06:25 IST

జనరల్‌ స్టడీస్‌ రీజనింగ్‌

ఆత్మీయమైన అమ్మ, అనురాగంతో నాన్న, ఆప్యాయంగా అక్క, అన్నివేళలా అండగా నిలిచే అన్న, చెదరని ప్రేమతో చెల్లి, తరగని ఆదరణతో తమ్ముడు.. అందరి జీవితాల్లోనూ ఉండే బంధాలు. అవి ఎప్పటికీ విడిపోని రక్తసంబంధాలు. అభ్యర్థుల విశ్లేషణాత్మక శక్తిని అంచనా వేయడం కోసం ఈ రిలేషన్లపై రీజనింగ్‌లో ప్రశ్నలు వస్తుంటాయి. ఎవరు ఎవరికి ఏమవుతారో కనిపెట్టాలి. తెలిసిన విషయాలే అయినా కాస్త తడబాటుకు గురిచేస్తాయి. కొన్ని నియమాలు నేర్చుకుంటే తేలిగ్గా సమాధానాలను గుర్తించవచ్చు.
 


రక్త సంబంధాలు
* సాధారణంగా సంబంధాలు రెండు రకాలు.
1) రక్త సంబంధాలు
  ఉదా: అమ్మ, సోదరి, సోదరుడు, మేనత్త
2) చట్టపరమైన సంబంధాలు
   ఉదా: భర్త, భార్య, అల్లుడు, మామయ్య

* సాధారణంగా పరీక్షల్లో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
   1) నేరుగా ఉండే సంబంధాలు (Direct Relations)
   2) కుటుంబ సంబంధాలు(Family Relations)
   3) తృతీయ వ్యక్తి సంబంధాలు(Indirect Relations)
   4) కోడ్‌ సంబంధాలు(Coded Relations)
సంబంధాలు జనరేషన్‌ వారీగా కింది విధంగా ఉంటాయి.
జనరేషన్‌ 1: తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ
   జనరేషన్‌ 2: తల్లి, తండ్రి, పెదనాన్న/చిన్నాన్న, మేనత్త, మేనమామ, అత్త, మామ
జనరేషన్‌ 3: సోదరి, సోదరుడు, భార్య, భర్త, వదిన/మరదలు, బావ/బావమరిది
జనరేషన్‌ 4: కుమారుడు, కుమార్తె, అల్లుడు, కోడలు, మేనల్లుడు, మేనకోడలు
జనరేషన్‌ 5: మనుమడు, మనుమరాలు
ప్రశ్నలో సాధారణంగా ‘కాదు’ అనే భావనను కింది విధంగా పరిగణించాలి.

* స్త్రీ కాదు - పురుషుడు  
* పురుషుడు కాదు- స్త్రీ
* భార్య కాదు - భర్త  
* భర్త కాదు - భార్య
* సోదరుడు కాదు - సోదరి
* తండ్రి కాదు - తల్లి
*కుమారుడు కాదు - కుమార్తె
* సమస్యల సాధనలో సౌలభ్యం కోసం కింది గుర్తులను ఉపయోగిస్తారు.
* ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన జనరేషన్‌కి చెందితే ‘అడ్డుగీత’ ద్వారా సూచిస్తారు.  
ఉదా: ab సోదరులు  a-b     

*ఇద్దరు వ్యక్తులు వేర్వేరు జనరేషన్లకు చెందితే ‘నిలువు గీత’ ద్వారా సూచిస్తారు.
ఉదా: a తండ్రి bb

* భార్య భర్తలను -గుర్తు ద్వారా సూచిస్తారు.
ఉదా:a భర్త b
a -b 

* పురుషులను +’ గుర్తుతో, స్త్రీలను ‘’గుర్తుతో సూచిస్తారు.
ఉదా: 1)a సోదరుడుb  a- b
2) a భర్త b a-b
3) a తల్లి b  b- a



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని