కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ టీహబ్‌ 2.వీ ను సీఎం కేసీఆర్‌ ఏ రోజున ప్రారంభించారు?

Published : 07 Sep 2022 00:25 IST

మాదిరి ప్రశ్నలు

* ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ టీహబ్‌ 2.వీ ను సీఎం కేసీఆర్‌ ఏ రోజున ప్రారంభించారు?
జ: 2022, జూన్‌ 28
* ఒకసారి ఛార్జింగ్‌ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా ఉండే సరికొత్త బ్యాటరీని ‘క్విలిన్‌’ పేరిట ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు?
జ: చైనా
* దేశంలోనే వంద శాతం ఓడీఎఫ్‌ ప్లస్‌ సాధించిన తొలి రాష్ట్రం ఏది?
జ: తెలంగాణ
* దేశంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 2022, జులై 1
* ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియా థయో మార్గిటా మాగ్నిఫికా (పొడవు దాదాపు ఒక సెంటీమీటరు) ను ఇటీవల ఎక్కడ కనుక్కున్నారు?
జ: కరీబియన్‌ దీవులు
* తెలంగాణలో ఎన్‌క్వాష్‌ (నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌) సర్టిఫికెట్లు పొందిన దవాఖానాల సంఖ్య 2022 జూన్‌ చివరి నాటికి ఎంతకు చేరింది?
జ: 143 (దేశంలో అత్యధిక ఎన్‌క్వాష్‌ సర్టిఫికెట్లు కలిగిన ప్రభుత్వ దవాఖానాలున్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానానికి చేరుకుంది)
* తెలంగాణలోని బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు విదేశీ విద్యపై ఏ ప్రముఖ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది?
జ: హార్వర్డ్‌ యూనివర్సిటీ
* జీఎస్టీ పరిహార సెస్సు విధింపు గడువును కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది?
జ: 2026, మార్చి 31
* దేశంలో రోడ్డు భద్రతను పెంపొందించడానికి, ప్రమాదాల్లో మరణాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం 2023, ఏప్రిల్‌ 1 నుంచి ఏ పేరుతో క్రాష్‌ టెస్టులు నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా వాహనాలకు రేటింగ్‌ ఇవ్వాలని నిర్ణయించింది?
జ: భారత్‌ న్యూ కార్‌ సేఫ్టీ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (భారత్‌ ఎన్‌సీఏపీ)
*  తుపాకుల వాడకంపై నియంత్రణ కోసం 2022 జూన్‌లో ఏ దేశ ప్రభుత్వం చట్టం చేసింది?
జ: అమెరికా


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని