కరెంట్‌ అఫైర్స్‌

అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) అథ్లెట్స్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన భారత మహిళా బాక్సర్‌ ఎవరు?

Published : 08 Sep 2022 02:53 IST

మాదిరి ప్రశ్నలు

అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) అథ్లెట్స్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన భారత మహిళా బాక్సర్‌ ఎవరు?

జ: లవ్లీనా బోర్గొహేన్‌ (ఈమెతో పాటు భారత బాక్సర్‌ శివ థాపా ఐబీఏ సభ్యుడిగా ఎన్నికయ్యారు)

తెలంగాణలో డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

జ: మాస్టర్‌ కార్డ్‌

‘మేడమ్‌ సర్‌’ పేరిట ఆత్మకథను రచించిన బిహార్‌ రాష్ట్ర తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిణి ఎవరు?

జ: మంజరి జరూహర్‌

బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున అధికారికంగా నిర్వహించింది?

జ: 2022, ఆగస్టు 8

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022లో బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టు ఏ పతకం నెగ్గింది?

జ: రజతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని