కరెంట్‌ అఫైర్స్‌

కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలోనే తొలిసారిగా భారత మహిళల జట్టు 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో లాన్‌ బౌల్స్‌ క్రీడలో స్వర్ణం నెగ్గింది. ఆ జట్టులోని నలుగురు సభ్యులు ఎవరు?

Updated : 17 Sep 2022 06:11 IST

మాదిరి ప్రశ్నలు

* కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలోనే తొలిసారిగా భారత మహిళల జట్టు 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో లాన్‌ బౌల్స్‌ క్రీడలో స్వర్ణం నెగ్గింది. ఆ జట్టులోని నలుగురు సభ్యులు ఎవరు?

జ: లవ్లీ చౌబే, రూపారాణి టిర్కి, పింకీ, నయన్‌-మోనీ సైకియా

* క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి త్రైమాసికంలో దేశంలోనే అత్యధికంగా 1,53,000 ఐటీ ఉద్యోగాలు కల్పించిన నగరం ఏది?

జ: హైదరాబాద్‌

* తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ (టీఎస్‌టీసీఎఫ్‌సీ) ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

జ: ఇస్లావత్‌ రామచందర్‌ నాయక్‌

* 2019-21 నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే ప్రకారం దేశంలో ఎంత శాతం మంది చిన్న పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు?

జ: 55 శాతం

* 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో పారా పవర్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారుడు ఎవరు?

జ: సుధీర్‌

* 2018-22 కాలానికి లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ‘నోటా’కు ఎన్ని ఓట్లు పోలైనట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) సంయుక్త నివేదిక వెల్లడించింది?

జ: 1.29 కోట్లు

* దేశంలోనే అత్యధిక మత్స్యకార సొసైటీలతో ఏ రాష్ట్రం రికార్డు సృష్టించింది?

జ: తెలంగాణ

* తెలంగాణలో నేతన్న బీమా పథకాన్ని మంత్రి కేటీఆర్‌ ఏ రోజున ప్రారంభించారు?

జ: 2022, ఆగస్టు 7


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని