సమయాన్ని సరిచేస్తే సమాధానం!

గడియారం ఆగిపోతే ఆఫీసుకు ఆలస్యం అవుతుంది. గంట కాస్త ముందే కొట్టేస్తే బస్టాండుకు వెళ్లి బస్సు కోసం పడిగాపులు కాయాలి. దీన్నే ‘దోష సమయం’ అంటారు. అందుకే ఎప్పటికప్పుడు సరైన టైమ్‌ కోసం క్లాక్‌ను సరిచేస్తుంటారు. అదే రీజనింగ్‌లో చేస్తే మార్కులూ సంపాదించుకోవచ్చు.

Updated : 17 Sep 2022 06:11 IST

జనరల్‌ స్టడీస్‌ రీజనింగ్‌

గడియారం ఆగిపోతే ఆఫీసుకు ఆలస్యం అవుతుంది. గంట కాస్త ముందే కొట్టేస్తే బస్టాండుకు వెళ్లి బస్సు కోసం పడిగాపులు కాయాలి. దీన్నే ‘దోష సమయం’ అంటారు. అందుకే ఎప్పటికప్పుడు సరైన టైమ్‌ కోసం క్లాక్‌ను సరిచేస్తుంటారు. అదే రీజనింగ్‌లో చేస్తే మార్కులూ సంపాదించుకోవచ్చు.

గడియారాలు - దోష సమయం

ఒక గడియారంలోని ముళ్లు భ్రమణంలో ఉన్న సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ గడియారం సరైన సమయాన్ని సూచించదు. దీన్నే ‘సమయంలో దోషం’ అంటారు. ఈ దోష సమయం ప్రధానంగా రెండు రకాలు.

1) సమయాన్ని పొందడం (Gaining time)

2) సమయాన్ని కోల్పోవడం (Losing time)

సమయాన్ని పొందడం: ఒక గడియారం అది సూచించాల్సిన సమయం కంటే ఎక్కువగా సూచిస్తుంటే ఆ గడియారం సమయాన్ని పొందింది అంటారు.

ఉదా: సరైన సమయం ఉదయం 8:00 సూచించాల్సిన ఒక గడియారం ఉదయం 8:05 గా సూచిస్తే ఆ గడియారం 5 నిమిషాల సమయాన్ని పొందింది అంటారు. అంటే దోషం 5 నిమిషాలు.

* గడియారం సమయాన్ని పొందుతున్న సందర్భంలో అది సూచించాల్సిన సరైన సమయాన్ని కనుక్కోవడానికి దోష సమయాన్ని తీసివేయాలి.

సమయాన్ని కోల్పోవడం: ఒక గడియారం అది సూచించాల్సిన సమయం కంటే తక్కువగా సూచిస్తే ఆ గడియారం సమయాన్ని కోల్పోతుంది అంటారు.

ఉదా: సరైన సమయం ఉదయం 8:00 సూచించాల్సిన ఒక గడియారం ఉదయం 7:56 గా సూచిస్తుంటే ఆ గడియారం 4 నిమిషాల సమయాన్ని కోల్పోయింది అంటారు. అంటే దోషం 4 నిమిషాలు.

* గడియారం సమయాన్ని కోల్పోతున్న సందర్భంలో అది సూచించాల్సిన సరైన సమయాన్ని కనుక్కోవడానికి కోల్పోయిన సమయాన్ని (దోష సమయాన్ని) కలపాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని