కరెంట్‌ అఫైర్స్‌

యూఈఎఫ్‌ఏ మహిళల ఛాంపియన్స్‌ లీగ్‌ బరిలోకి దిగిన తొలి భారత మహిళా ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా ఎవరు ఘనత సాధించారు?

Published : 22 Sep 2022 04:50 IST

మాదిరి ప్రశ్నలు

* యూఈఎఫ్‌ఏ మహిళల ఛాంపియన్స్‌ లీగ్‌ బరిలోకి దిగిన తొలి భారత మహిళా ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా ఎవరు ఘనత సాధించారు?

జ: మనీషా కల్యాణ్‌

* ఓటరుగా నమోదు చేసుకోవడానికి 18 ఏళ్లు నిండిన వారికి ఏడాదిలో ఎన్నిసార్లు అవకాశం కల్పిస్తూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది?

జ: 4 సార్లు (జనవరి 1, ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబరు 1)

* ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ ప్రొజెక్షన్‌ నివేదిక-2022 ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా జీడీపీ వృద్ధి సాధించిన టాప్‌-10 నగరాల్లో హైదరాబాద్‌ ఎన్నో స్థానంలో నిలిచింది?

జ: 2వ స్థానం (తొలిస్థానంలో వియత్నాంలోని హోచిమిన్‌ సిటీ నిలిచింది)

* దేశంలో తొలి డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సును ఈఐవీ-22 పేరిట 2022 ఆగస్టులో ముంబయిలో ఏ సంస్థ ఆవిష్కరించింది?

జ: అశోక్‌ లేలాండ్‌

* 10 కంటే ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ‘మదర్‌ హీరోయిన్‌’ పురస్కారంతో పాటు రూ.13 లక్షల రివార్డును ఇవ్వాలని ఏ దేశ ప్రభుత్వం నిర్ణయించింది?

జ: రష్యా

* విద్యుత్తు అవసరం లేకుండా అయస్కాంత శక్తితో ప్రయాణించే సరికొత్త హైటెక్‌ రైళ్లను ‘స్కై ట్రైన్స్‌’ పేరిట ఇటీవల ఏ దేశంలో విజయవంతంగా పరీక్షించారు?

జ: చైనా

* 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండగా, 2022 నాటికి ఎంత మొత్తానికి చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి?

జ: రూ.11.55 లక్షల కోట్లు

* 2022 ఆగస్టులో కోల్‌కతాలో మరణించిన సమర్‌ బద్రు బెనర్జీ (92) ఏ క్రీడలో ప్రసిద్ధులు?

జ: ఫుట్‌బాల్‌

* మెలోడీ క్వీన్‌గా పేరుగాంచిన ఏ దేశానికి చెందిన దిగ్గజ గాయని నయ్యారా నూర్‌ 2022 ఆగస్టులో మరణించారు?

జ: పాకిస్థాన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని