పోలిక తెలిస్తే జవాబు తేలికే!

కొత్త సినిమా చూశారు. దాని గురించి స్నేహితుడికి విశ్లేషించాలంటే, ఇద్దరూ కలిసి చూసిన ఇంకో సినిమాతో పోలుస్తూ వివరించాలి. అప్పుడే అనుకున్నది సులభంగా చెప్పగలుగుతారు. తార్కికంగా వివరించగలిగిన ఆ విధమైన శక్తిని అభ్యర్థుల్లో

Published : 23 Sep 2022 00:53 IST

జనరల్‌ స్టడీస్‌ - రీజనింగ్‌

కొత్త సినిమా చూశారు. దాని గురించి స్నేహితుడికి విశ్లేషించాలంటే, ఇద్దరూ కలిసి చూసిన ఇంకో సినిమాతో పోలుస్తూ వివరించాలి. అప్పుడే అనుకున్నది సులభంగా చెప్పగలుగుతారు. తార్కికంగా వివరించగలిగిన ఆ విధమైన శక్తిని అభ్యర్థుల్లో పరిశీలించేందుకే పోటీ పరీక్షల్లో అనాలజీ ప్రశ్నలు ఇస్తుంటారు. ప్రశ్న మొదటి భాగంలోని పోలికను పట్టుకుంటే సమాధానాన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.

అనాలజీ/ సాదృశ్యం
పోలిక పరీక్ష (అనాలజీ)లో భాగంగా రెండు జతల పదాలు ఇస్తారు. మొదటి జతలోని రెండు పదాల మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కుని అదే సంబంధాన్ని రెండో జతలోని పదానికి అనువర్తించడం ద్వారా లోపించిన పదాన్ని కనుక్కోవచ్చు. సంఖ్యాశ్రేణి, అక్షరశ్రేణి లాంటి అంశాలపై పట్టు ఉంటే ప్రశ్నలకు సమాధానాలు సులువుగా సాధించవచ్చు.

సంఖ్యా సాదృశ్యానికి సంబంధించిన ప్రశ్నలను సాధించడానికి ముందుగా అభ్యర్థికి ప్రాథమిక గణిత పరిక్రియలు, వర్గాలు, ఘనాలు, ఎక్కాలపై అవగాహన ఉండాలి.

పద సాదృశ్యం
ఉదా: రేడియో : శ్రోత :: సినిమా : ...
1 నిర్మాత      2 నటుడు
3 ప్రేక్షకుడు    4 దర్శకుడు

జవాబు: 3
సాధన: రేడియో ప్రసారాలు వినేవారు శ్రోతలు కాగా, సినిమా వీక్షించే వారిని ప్రేక్షకులు అంటారు.
పద సాదృశ్యానికి సంబంధించి అభ్యర్థికి పలురకాలైన అంశాలపై   అవగాహన ఉండాలి.
ఉదా: దేశం - అధ్యక్షుడు
దేశం - రాజధాని
దేశం - కరెన్సీ
రాష్ట్రం - ముఖ్యమంత్రి/గవర్నరు
రాష్ట్రం - రాజధాని
ప్రాంతం - కట్టడాలు
భౌతికరాశి - ప్రమాణాలు
పరికరం - ఉపయోగం
శాస్త్రవేత్త - పరికరం
వ్యాధి - వ్యాధి కారకం
వీటితోపాటు భౌతిక, రసాయన, గణిత, సాంఘిక, జీవశాస్త్రాలకు సంబంధించిన పదాలు, వాటి వివరణలపై అవగాహన ద్వారా పద సాదృశ్య ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని