చిన్నచూపు మంచిది కాదు!

బాగా చదివే విద్యార్థులు కొంతమంది ప్రతిభ, తెలివితేటలు తమకే సొంతమన్నట్టుగా.. తమకు ఎదురులేదన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. తరగతిలోని సగటు విద్యార్థులను కాస్త చిన్నచూపు చూస్తుంటారు. ఈ కథలోని ఏనుగులా...

Published : 27 Sep 2022 00:23 IST

బాగా చదివే విద్యార్థులు కొంతమంది ప్రతిభ, తెలివితేటలు తమకే సొంతమన్నట్టుగా.. తమకు ఎదురులేదన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. తరగతిలోని సగటు విద్యార్థులను కాస్త చిన్నచూపు చూస్తుంటారు. ఈ కథలోని ఏనుగులా...

అడవిలో పెద్ద ఏనుగు ఒకటి ఉండేది. బలమైనదాన్ననే అహంకారంతో విర్రవీగుతుండేది. చిన్న జంతువులను హింసించి ఆనందించేది. చెట్టు కింది పుట్టలో ఉండే చీమలు.. దాని ఆగడాలను గమనిస్తుండేవి. ఒకరోజు చీమలు ఆహారం తీసుకుని వస్తుండగా... ఏనుగు ఆ గుంపు మీద నీళ్లు పోసింది. ఏనుగు ప్రవర్తనతో ఇబ్బందిపడ్డ చీమలు ‘నువ్విలా చేయడం ఏమీ బాగాలేదు’ అన్నాయి. ‘నాకే ఎదురు చెబుతారా? నోరు మూసుకుని వెళ్లండి. ఒక తొక్కు తొక్కానంటే ఇప్పుడే చస్తారు’ అంది కోపంగా. చేసేదిలేక అవన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కానీ ఏనుగుకు గుణపాఠం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి. మర్నాడు ఏనుగు నిద్రపోతుండగా చిట్టి చీమలు కొన్ని మెల్లగా ఏనుగు తొండంలో దూరి కుట్టడం మొదలుపెట్టాయి. ఆ నొప్పికి లేచిన ఏనుగు.. తొండంలోని చీమలను బయటకు తీయడానికి నానా తంటాలూ పడింది. అంతపెద్ద ఏనుగు చిన్న చీమలను తొండం నుంచి బయటకు తీయలేకపోయింది. దాంతో ఏడుస్తూ క్షమించమని అడిగింది. జాలిపడిన చీమలు బయటకు వచ్చి... ‘ఇప్పుడు మా బాధ నీకు అర్థమైందనుకుంటాను. ఇంకెప్పుడూ చిన్న ప్రాణులను హింసించకు’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అప్పటినుంచీ ఏనుగు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని