మూసకు భిన్నంగా!

మన ఆలోచనలన్నీ సాధారణంగా ఒకే తరహాలో సాగుతుంటాయి. పాఠాలు నేర్చుకోవడానికీ, పరీక్షలు రాయడానికీ చిన్నతనం నుంచీ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటాం. విభిన్నమైన సవాళ్లూ, పరిస్థితులూ ఎదురైనప్పుడూ ఆ పరిధి దాటి బయటకు వెళ్లం.

Published : 29 Sep 2022 00:57 IST

ప్రేరణ

మన ఆలోచనలన్నీ సాధారణంగా ఒకే తరహాలో సాగుతుంటాయి. పాఠాలు నేర్చుకోవడానికీ, పరీక్షలు రాయడానికీ చిన్నతనం నుంచీ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటాం. విభిన్నమైన సవాళ్లూ, పరిస్థితులూ ఎదురైనప్పుడూ ఆ పరిధి దాటి బయటకు వెళ్లం. ఒక్క మాటలో చెప్పాలంటే.. మూస ధోరణికి అలవాటు పడిపోతుంటాం. అదే నిజమని భ్రమపడుతుంటాం కూడా. కానీ సమస్యను మరో కోణం నుంచి ఆలోచిస్తే.. అద్భుత ఫలితాన్ని పొందొచ్చని చెబుతుందీ కథ.

ఒకరోజు వెంకట్‌ మ్యాగజైన్‌ చదువుతుండగా అతడి ఏడేళ్ల కూతురు అమూల్య అక్కడికి వచ్చి... రకరకాల ప్రశ్నలు వేయసాగింది. చిన్నారిని ఎలాగైనా బిజీగా ఉంచాలనే ఉద్దేశంతో..  మ్యాగజైన్‌లోంచి ఒక పేజీ తీసి.. చిన్న ముక్కలుగా చేశాడు వెంకట్‌. ఆ పేజీ మీద ప్రపంచ పటం ముద్రించి ఉంది. ఈ పటాన్ని యథాతథంగా అతికించి తెమ్మన్నాడు. ఇక చిన్నారి సాయంత్రం వరకూ అదే పనిలో ఉంటుందని ఊహించాడు. కానీ అతడి ఊహలను భగ్నంచేస్తూ అమూల్య కొద్దిసేపట్లోనే పటాన్ని చక్కగా అతికించి తెచ్చింది. ఆశ్చర్యపోయిన వెంకట్‌ ‘ఇంత త్వరగా ఎలా చేయగలిగావ’ని అడిగాడు. ‘పేజీకి వెనకవైపు మనిషి ముఖం ఉంది. ఆ ముఖాన్ని సరిగ్గా అతికించాను. అంతే మ్యాప్‌ సిద్ధమైంది’ అని చెప్పి ఆడుకోవడానికి బయటకు పరుగెత్తింది. తన ఊహకు భిన్నంగా ఆలోచించి స్మార్ట్‌గా పని పూర్తిచేసిన కూతురుని ఆశ్చర్యంతో చూస్తుండిపోయాడు వెంకట్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని