కరెంట్‌ అఫైర్స్‌

యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ దేవాలయం రామప్ప ప్రాశస్త్యాన్ని ‘తెలంగాణ గ్లోరీ’ పేరుతో ఏ పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చారు?

Published : 30 Sep 2022 00:41 IST

మాదిరి ప్రశ్నలు

* యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ దేవాలయం రామప్ప ప్రాశస్త్యాన్ని ‘తెలంగాణ గ్లోరీ’ పేరుతో ఏ పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చారు?
జ: ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఇంగ్లిష్‌ పాఠ్య పుస్తకం


* దేశంలోనే అతిపెద్ద మియావాకీ ఫారెస్ట్‌ ఏ నగరంలో ఉంది? (10 ఎకరాల్లో మియావాకీ పద్ధతిలో మొక్కలు నాటారు) జ: హైదరాబాద్‌


* ప్రపంచ బ్యాంకు 2022-23లో ప్రపంచవ్యాప్తంగా దేశాల జీఎన్‌ఐ (గ్రాస్‌ నేషనల్‌ ఇన్‌కమ్‌ - స్థూల జాతీయాదాయం)ను అంచనా వేస్తూ ఆదాయం ఆధారంగా నిర్ధారించిన కేటగిరీల ప్రకారం భారత్‌ ఏ జాబితాలో ఉంది?
జ: లోయర్‌ మిడిల్‌ ఇన్‌కమ్‌ (దిగువ మధ్యతరగతి ఆదాయం) దేశాల జాబితా


* స్వచ్ఛ బడి చెత్త సేకరణ, నిర్వహణలో సిద్దిపేట దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?    
జ: రెండో స్థానం (బెంగళూరుకు చెందిన పాఠశాల దేశంలోనే మొదటి స్థానంలో ఉంది)


* కేంద్ర ప్రభుత్వ ‘జల్‌ జీవన్‌ మిషన్‌ - హర్‌ ఘర్‌ జల్‌’ వెబ్‌సైట్‌ గణాంకాల ప్రకారం 2022, ఆగస్టు 20 నాటికి తెలంగాణలో ఎంత శాతం ఇళ్లకు నల్లా నీరు అందుతోంది? (తెలంగాణలో మొత్తం గృహాల సంఖ్య 53,86,962) జ: 100%


* ఆనంద నిలయం పేరుతో 100 ఎకరాల్లో అద్భుత బృందావనాన్ని తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: సిద్దిపేట సమీపంలోని కొండపాక వద్ద


* ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలకు పది నిమిషాల్లోపే ఛార్జింగ్‌ చేసే సరికొత్త  విధానాన్ని అభివృద్ధి చేసినట్లు ఏ దేశంలోని ఇదాహో నేషనల్‌   ల్యాబొరేటరీ పరిశోధకులు ప్రకటించారు?  జ: అమెరికా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని