ప్రాక్టీస్‌ బిట్లు

క్లోనింగ్‌ ద్వారా ఉద్భవించిన జీవి దేన్ని పోలి ఉంటుంది?

Published : 30 Sep 2022 00:46 IST

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

1. క్లోనింగ్‌ ద్వారా ఉద్భవించిన జీవి దేన్ని పోలి ఉంటుంది?
1) కేంద్రకాన్ని దానం చేసిన జీవి     2) అండాన్ని దానం చేసిన జీవి
3) శుక్రకణాన్ని దానం చేసిన జీవి    4) ఆర్‌ఎన్‌ఏను దానం చేసిన జీవి

2. వేటిలో సహజంగా క్లోన్స్‌ ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది?
1) క్షీరదాలు               2) మల్లె, గులాబి, మందార లాంటి మొక్కలు
3) పక్షులు, సరీసృపాలు     4) అమీబా, యుగ్లీనా

3. క్లోనింగ్‌ ప్రక్రియ ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది?
1) శుక్రకణ కేంద్రక మార్పిడి      2) అండకణ కేంద్రక మార్పిడి
3) దేహకణ కేంద్రక మార్పిడి      4) రక్తకణ కేంద్రక మార్పిడి

4. మొదటిసారి దేహకణ కేంద్రక మార్పిడి ద్వారా క్లోనింగ్‌ ప్రయోగాలు చేసిన ఏ శాస్త్రవేత్తను క్లోనింగ్‌ పితామహుడు అంటారు?
1) జాకబ్‌ సన్‌     2) జాన్‌ గుర్డాన్‌    3) బేట్సన్‌    4) పన్నెట్‌

5. క్లోనింగ్‌ ద్వారా సృష్టించిన మొదటి ఉన్నతస్థాయి జంతువు/క్షీరదం?
1) సిమి అనే పిల్లి పిల్ల        2) ఇంతియాజ్‌ అనే ఒంటె
3) టెట్రా అనే కోతి            4) డాలి అనే గొర్రెపిల్ల

సమాధానాలు: 1-1; 2-2; 3-3; 4-2; 5-4.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని