కరెంట్‌ను కొలిచే సూత్రాలు!

హీటర్లు, రైస్‌ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలు, బల్బులు ఇలా ఎన్నో రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులను ఇళ్లలో వినియోగిస్తుంటారు. వాటిని ఎడాపెడా వాడేసి నెల చివర్లో బిల్లు రాగానే కళ్లు పెద్దవి చేసేసి కంగారు పడుతుంటారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉపయోగించాలని అలవాటుగా అనుకుంటారు. కానీ కంటికి కనిపించని ఆ కరెంట్‌ను

Published : 01 Oct 2022 02:23 IST

జనరల్‌ స్టడీస్‌  ఫిజిక్స్‌

హీటర్లు, రైస్‌ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలు, బల్బులు ఇలా ఎన్నో రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులను ఇళ్లలో వినియోగిస్తుంటారు. వాటిని ఎడాపెడా వాడేసి నెల చివర్లో బిల్లు రాగానే కళ్లు పెద్దవి చేసేసి కంగారు పడుతుంటారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉపయోగించాలని అలవాటుగా అనుకుంటారు. కానీ కంటికి కనిపించని ఆ కరెంట్‌ను ఎలా కొలుస్తారో కనుక్కొని అవగాహన పెంచుకుందామని ఆలోచించి ఉండరు. ఇదుగో ఇప్పుడు ప్రయత్నించండి. ఇది తెలుసుకుంటే పోటీ పరీక్షల్లో మార్కులూ తెచ్చుకోవచ్చు.

కిలోవాట్‌ - గంట: మనం ఇళ్లల్లో వాడే విద్యుత్తు శక్తి వినియోగాన్ని కిలోవాట్‌ - గంటల్లో కొలుస్తారు. ఒక కిలోవాట్‌ (అంటే వెయ్యి వాట్లు) సామర్థ్యంతో ఒక గంట కాలంలో వినియోగించిన విద్యుత్తు శక్తి ఒక కిలోవాట్‌ - గంట అవుతుంది. సాధారణంగా ఈ కిలోవాట్‌ గంటనే ఒక యూనిట్‌ అంటారు.

1 కిలోవాట్‌ గంట = 1 యూనిట్‌ = 36 ´ 105 జౌళ్లు.

ఇళ్లల్లో వాడే విద్యుత్తు శక్తిని ఈ యూనిట్‌లలో కొలిచి, యూనిట్‌కి ఇంత రేటున లెక్కగడతారు. ఒక నెలకు వచ్చే కరెంటు బిల్లు ఆ నెల మొత్తం మనం వాడుకున్న యూనిట్లకు లెక్కగట్టిన సొమ్ము అవుతుంది.


మాదిరి ప్రశ్నలు

1. ఎలక్ట్రిక్‌ హీటర్లు ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి?

1) ఓమ్‌     2) ఫారడే        3) ఆంపియర్‌    4) జౌల్‌

2. కింది ఏ నియమం శక్తి నిత్యత్వ నియమాన్ని పాటిస్తుంది?

1) కిర్కాఫ్‌ మొదటి నియమం         2) కిర్కాఫ్‌ రెండో నియమం     3) ఓమ్‌ నియమం                4) ఆయిర్‌స్టెడ్‌ నియమం

3. అమ్మీటర్‌ను సాధారణంగా ఏ సంధానంలో కలుపుతారు?

1) శ్రేణి      2) సమాంతర     3) 1, 2       4) ఏదీకాదు

4. ఆదర్శ ఓల్ట్‌ మీటర్‌ వాహకత్వం?

1) అనంతం    2) ధనాత్మకం    3) రుణాత్మకం    4) సున్నా

5. ఆదర్శ అమ్మీటర్‌ నిరోధం?

1) సున్నా     2) అనంతం    3) రుణాత్మకం    4) ధనాత్మకం

6. కిర్కాఫ్‌ మొదటి నియమం దేని పర్యవసానం?

1) శక్తి నిత్యత్వ నియమం           2) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం    3) విద్యుదావేశ నిత్యత్వ నియమం      4) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం

7. స్వల్ప విద్యుత్తు ప్రవాహాలను కొలిచే పరికరం?

1) అమ్మీటర్‌   2) ఓల్ట్‌ మీటర్‌    3) ఇన్వర్టర్‌   4) గాల్వానో మీటర్‌

8. 1 కిలోవాట్‌ - గంట విలువ = ....... జౌళ్లు

1) 3.6 ´ 105     2) 36 ´ 105     3) 36 ´ 106    4) 36 ´ 1010

9. ఎలక్ట్రిక్‌ ఇస్త్రీ పెట్టెలు పనిచేసే నియమం?

1) కిర్కాఫ్‌ నియమం   2) లెంజ్‌ నియమం   3) జౌల్‌ నియమం  4) ఓమ్‌ నియమం

10. మన ఇళ్లలో వినియోగించే విద్యుత్తు శక్తిని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?

1) వాట్‌-అవర్‌   2) వాట్‌-సెకన్‌   3) కిలోవాట్‌-అవర్‌   4) వాట్‌

సమాధానాలు: 1-4, 2-2, 3-1, 4-4, 5-1, 6-3, 7-4, 8-2, 9-3, 10-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని