కరెంట్‌ అఫైర్స్‌

ఉపరితలం నుంచి గగనతలానికి నిలువుగా ప్రయోగించే క్షిపణి (వీఎల్‌-ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం)ను  ఒడిశాలోని చాందీపూర్‌ తీరం నుంచి డీఆర్‌డీవో, నావికాదళం సంయుక్తంగా ఏ రోజున విజయవంతంగా పరీక్షించాయి?       

Published : 01 Oct 2022 02:23 IST

మాదిరి ప్రశ్నలు

* ఉపరితలం నుంచి గగనతలానికి నిలువుగా ప్రయోగించే క్షిపణి (వీఎల్‌-ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం)ను  ఒడిశాలోని చాందీపూర్‌ తీరం నుంచి డీఆర్‌డీవో, నావికాదళం సంయుక్తంగా ఏ రోజున విజయవంతంగా పరీక్షించాయి?       

జ: 2022, ఆగస్టు 23

వన్‌ నేషన్‌ - వన్‌ ఫర్టిలైజర్‌ విధానంలో భాగంగా 2022, అక్టోబరు నుంచి దేశం మొత్తం ఒకే రకమైన బ్రాండ్‌ ఎరువులను ఏ పేరుతో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?

జ: ప్రధానమంత్రి భారతీయ జన్‌ ఉర్వారక్‌ పరియోజన (ఎరువుల దుకాణాలకు ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రం అని పేరు పెట్టాలని నిర్ణయించారు.

ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేటు ఆసుపత్రిని (130 ఎకరాల విస్తీర్ణంలో  రూ.6 వేల కోట్ల ఖర్చు, 2600 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు) అమృతా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పేరిట 2022, ఆగస్టు 24న ఏ నగరంలో ప్రారంభించారు?  

జ: ఫరీదాబాద్‌ (హరియాణా)

అ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు?

జ: జి.సతీష్‌ రెడ్డి

ఆ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన ప్రభుత్వంలో దాదాపు ఎన్ని ప్రాధాన్యమైన పదవులను భారతీయ అమెరికన్లకు కట్టబెట్టినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి?                   

జ: 130

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హయాంలో సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులకు మొత్తం ఎంత మంది న్యాయమూర్తులను  నియమించింది?            

జ: 224

ఉపరితలం మొత్తం పూర్తిగా నీటితో నిండి ఉన్న ఒక గ్రహాన్ని నాసాకు చెందిన టెస్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తాజాగా గుర్తించింది. ఆ గ్రహం పేరు ఏమిటి?

జ: టీవోఐ-1452బి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని