ప్రాక్టీస్‌ బిట్లు

అజ్మీర్‌ నగరాన్ని నిర్మించినవారు?

Published : 01 Oct 2022 02:23 IST

భారతదేశ చరిత్ర

1. అజ్మీర్‌ నగరాన్ని నిర్మించినవారు?

1) అజయ రాజు        2) నేమి రాజు       3) యజరాజు          4) సింహరాజు చౌహాన్‌

2. విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన పాలకుడు ఎవరు?

1) గోపాలుడు      2) మహీపాలుడు   3) ధర్మపాలుడు      4) విజయసింహుడు

3. విశిష్టాద్వైత మార్గాన్ని ప్రతిపాదించినవారు?

1) రామానుజాచార్యులు   2) కృపాచార్యుడు   3) మద్వాచార్యులు         4) శంకరాచార్యులు

4. పంచరత్నాలు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?

1) బల్లాల సేనుడు           2) విజయ సేనుడు   3) లక్ష్మణ సేనుడు                 4) రాజ్యసేనుడు

5. రాజపుత్రుల కాలం నాటి రాజభాష ఏది?

1) పాళి    2) ప్రాకృతం     3) అర్థమగధి    4) సంస్కృతం

6. ఘటికల్లో ఏ విద్యలు నేర్పేవారు?

1) బౌద్ధ    2) జైన       3) వైదిక       4) వ్యాపార

7. తూర్పు చాళుక్యుల్లో గొప్ప రాజు ఎవరు?

1) కుబ్జ విష్ణువర్ధనుడు   2) గుణగ విజయాదిత్యుడు 3) మూడో విష్ణువర్ధనుడు 4) చాళుక్య భీముడు

8. నవబ్రహ్మ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి?

1) అలంపురం    2) బాదామి    3) పట్టడకళ్‌  4) ఐహోల్‌

9. గణితసార సంగ్రహాన్ని రచించినవారు?

1) పావులూరి మల్లన     2) నారాయణ భట్టు   3) మహావీరాచారి         4) తిక్కన

10. తన ఖడ్గాన్ని యమునా నది తీరంలో ఉన్న కాళప్రియం (నేటి కాల్పి) వద్ద కడిగిన వేములవాడ పాలకుడు ఎవరు?

1) మొదటి బద్దెగడు     2) రెండో బద్దెగడు 3) రెండో నరసింహకుడు   4) మొదటి అరికేసరి

సమాధానాలు: 1-1; 2-3; 3-1; 4-3; 5-4; 6-3; 7-2; 8-1; 9-1; 10-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని