ఆర్థిక అంశాలపై ఒలింపియాడ్‌

విద్యార్థులకు తాము చదివే సబ్జెక్టులపైనే కాకుండా ఆర్థిక అంశాలపైనా అవగాహన ఉండాలని భావించిన ‘మ్యువిన్‌’ సంస్థ... దేశవ్యాప్తంగా ఇంటర్‌ వరకూ చదివే విద్యార్థుల కోసం ‘ఫిన్‌మానియా’ పేరుతో ఫైనాన్షియల్‌ ఒలింపియాడ్‌ నిర్వహిస్తోంది.

Published : 04 Oct 2022 01:03 IST

విద్యార్థులకు తాము చదివే సబ్జెక్టులపైనే కాకుండా ఆర్థిక అంశాలపైనా అవగాహన ఉండాలని భావించిన ‘మ్యువిన్‌’ సంస్థ... దేశవ్యాప్తంగా ఇంటర్‌ వరకూ చదివే విద్యార్థుల కోసం ‘ఫిన్‌మానియా’ పేరుతో ఫైనాన్షియల్‌ ఒలింపియాడ్‌ నిర్వహిస్తోంది. మింట్‌, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లతో సమష్టిగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. విద్యార్థులకు ఆర్థిక భద్రత, బీమా, మనీ మేనేజ్‌మెంట్‌లాంటి అంశాలపై అవగాహన తీసుకురావడం, సొంతంగా ఆలోచించేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పెట్టుబడి, పొదుపు, రుణం... లాంటి అనేక విషయాలను ఈ ఒలింపియాడ్‌ ద్వారా చర్చించనున్నారు.

* ఇందులో పాల్గొనేందుకు అక్టోబర్‌ 14వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం ఆఫ్‌లైన్‌లో జరుగుతుండగా, మిగతా చోట్ల ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

* ఇందులో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. జోనల్‌, నేషనల్‌ స్థాయిలో విజేతలను ప్రకటించి రూ.10 లక్షల వరకూ విలువైన బహుమతులు అందజేస్తారు.

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్‌సైట్‌ : www.finmania.in
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని