కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రూపుదిద్దుకుంటున్న ‘వేదిక్‌ ప్లానిటోరియం’ను ఏ రాష్ట్రంలోని మాయాపూర్‌లో నిర్మిస్తున్నారు? (ఇప్పటి వరకు ప్రపంచంలోని అతిపెద్ద ఆలయంగా కాంబోడియాలోని ఆంగ్‌కోర్‌ - వాట్‌ ఆలయం రికార్డుల్లో ఉంది)

Published : 10 Oct 2022 01:05 IST

మాదిరి ప్రశ్నలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రూపుదిద్దుకుంటున్న ‘వేదిక్‌ ప్లానిటోరియం’ను ఏ రాష్ట్రంలోని మాయాపూర్‌లో నిర్మిస్తున్నారు? (ఇప్పటి వరకు ప్రపంచంలోని అతిపెద్ద ఆలయంగా కాంబోడియాలోని ఆంగ్‌కోర్‌ - వాట్‌ ఆలయం రికార్డుల్లో ఉంది) జ: పశ్చిమ బెంగాల్‌


* హైగ్రోస్కోపిక్‌ సాంకేతికతతో ఇటీవల ఏ దేశ పరిశోధకులు మేఘమథనం ప్రక్రియను చేపట్టారు? జ: యూఏఈ


* చంద్రుడిపై ప్రయోగాలు, మనుషులను అక్కడ సుదీర్ఘ కాలం పాటు ఉంచడమే లక్ష్యంగా ఏ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఆర్టెమిస్‌-1 మిషన్‌ను చేపట్టింది? జ: అమెరికా


* సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగంలో దేశంలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి? జ: 4వ స్థానం


* ఏ దేశంలోని ఆదివాసీ తెగకు చెందిన ఒంటరి మనిషి ఇటీవల మరణించారు? (ఈ దేశంలోని రోండానియా రాష్ట్రంలో ఉన్న టనూరు ఆదివాసీ ప్రాంతంలో ఒక ఆదివాసీ తెగలో ఇతడు చివరివాడు కావడంతో మానవ జాతిలో ఒక తెగ అంతరించినట్లయింది) జ: బ్రెజిల్‌


* టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా జావెలిన్‌ను ఏ దేశంలోని లుసానె ఒలింపిక్‌ మ్యూజియంలో భద్రపరచాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం నిర్ణయించింది? జ: స్విట్జర్లాండ్‌


* పండ్లు, కూరగాయలను రెండు నెలల పాటు తాజాగా ఉంచే బయోడీగ్రేడబుల్‌ కోటింగ్‌ మెటీరియల్‌ను ఏ ఐఐటీ పరిశోధకులు  పొందించారు?జ: గువాహటి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని