లైబ్రరీ

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1, 2 సిలబస్‌నూ, డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థుల కామన్‌ కోర్‌ సిలబస్‌నూ కవర్‌ చేస్తూ రూపొందించిన పుస్తకం. రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల గణాంకాలు, ప్రచురణల ఆధారంగా వివిధ భౌగోళిక అంశాల తాజా డేటాను పొందుపరిచారు.

Published : 17 Oct 2022 00:20 IST

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1, 2 సిలబస్‌నూ, డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థుల కామన్‌ కోర్‌ సిలబస్‌నూ కవర్‌ చేస్తూ రూపొందించిన పుస్తకం. రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల గణాంకాలు, ప్రచురణల ఆధారంగా వివిధ భౌగోళిక అంశాల తాజా డేటాను పొందుపరిచారు. తెలంగాణ 33 జిల్లాలుగా ఏర్పడ్డాక సమగ్ర వివరాలతో, విశ్లేషణలతో వెలువడిన ఈ పాఠ్యగ్రంథం కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకూ, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకూ ప్రయోజనకరం.  

తెలంగాణ ప్రాంతీయ భూగోళశాస్త్రం

పేజీలు: 432; వెల: రూ.213 ప్రచురణ: తెలుగు అకాడమి, హైదరాబాద్‌


పోటీ పరీక్షల కోసం సులభమైన భాషలో వివిధ రాజ్యాంగ అంశాలను దీనిలో పొందుపరిచారు. తాజా రాజ్యాంగ సవరణలు, న్యాయస్థానాల ఇటీవలి తీర్పులు, రాష్ట్రపతి- ఉపరాష్ట్రపతి ఎన్నికలు మొదలైన సరికొత్త అంశాలను చాప్టర్ల వారీగా అనుసంధానించారు. పోటీ పరీక్షల్లో కీలకమైన సంక్షేమ పాలన, రాష్ట్రస్థాయి పంచాయతీ చట్టాలు, సమాచార హక్కు, లోక్‌పాల్‌, లోకాయుక్త మొదలైన విషయాలను కూడా ఈ పుస్తకంలో చేర్చారు.

ఇండియన్‌ పాలిటీ

పేజీలు: 488; ధర: 499 ప్రచురణ: విద్వాన్‌ పబ్లికేషన్స్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని