కరెంట్‌ అఫైర్స్‌

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌గా 2022, సెప్టెంబరు 2న ఎవరు బాధ్యతలు చేపట్టారు?

Published : 17 Oct 2022 00:28 IST

మాదిరి ప్రశ్నలు

* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌గా 2022, సెప్టెంబరు 2న ఎవరు బాధ్యతలు చేపట్టారు?

జ: గ్యారెత్‌ విన్‌ ఓవెన్‌

* ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌ స్కీ ట్విటర్‌ వన్‌ వర్డ్‌ ట్రెండ్‌లో భాగంగా ఏ పదాన్ని ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచారు

? జ: ఫ్రీడమ్‌

* అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన తెలంగాణ వాసి ఎవరు?

జ: షబ్బీర్‌ అలీ

* కేంద్ర హోంశాఖ నిర్వహించిన సీసీటీఎన్‌ఎస్‌ హ్యాకథాన్‌ అండ్‌ సైబర్‌ ఛాలెంజ్‌ - 2022లో తెలంగాణ పోలీస్‌ ‘సైకాప్స్‌ ఐటీ టూల్‌’ జాతీయ స్థాయిలో ఏ బహుమతి పొందింది? (సైబర్‌ నేరాలను అరికట్టేందుకు, సైబర్‌ నేర పరిశోధనలో ఉపయోగపడేలా సైకాప్స్‌ ఐటీ టూల్‌ను రూపొందించారు)

జ: ప్రథమ బహుమతి

* కోల్‌లాగ్‌ ఇండియా - 2022 అంతర్జాతీయ సదస్సును 2022, సెప్టెంబరు 2న ఎక్కడ నిర్వహించారు?

జ: కోల్‌కతా

* అంగారకుడు, శుక్రుడు పై పేలోడ్స్‌ను సులువుగా ల్యాండింగ్‌ చేసేందుకు ఉపయోగించే ఇన్‌ప్లేటబుల్‌ ఏరో డైనమిక్‌ డిసెలేటర్‌(ఐఏడీ) సాంకేతికతను ఇస్రో 2022, సెప్టెంబరు 3న ఎక్కడి నుంచి విజయవంతంగా ప్రయోగించింది?

జ: తుంబా (కేరళ)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని