Published : 11 Nov 2022 00:35 IST

కరెంట్‌ అఫైర్స్‌

మాదిరి ప్రశ్నలు

* శత్రు దేశాల కంట పడకుండా దాడులు జరపడంలో కీలకపాత్ర పోషించే యుద్ధనౌక ‘తారాగిరి’ని భారత నావికాదళం 2022, సెప్టెంబరు 11న ఏ నగర తీరంలో ఆవిష్కరించింది? (రూ.25,700 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు 17తిలో భాగంగా స్టెల్త్‌ సాంకేతికతను ఉపయోగించి నావికాదళం ఈ యుద్ధనౌకను రూపొందించింది)              

జ: ముంబయి

*  అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ‘జంగల్‌ బచావో .. జంగల్‌ బడావో’ అనే నినాదాన్ని తీసుకుంది)              

జ: సెప్టెంబరు 11

*  దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌, విజయవాడ, గుంతకల్‌ డివిజన్లలో రైళ్లు గంటకు ఎన్ని కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించేందుకు అనుమతులు లభించాయి?          

జ: 130 కి.మీ.

*  బ్రిటన్‌ నూతన రాజుగా 2022, సెప్టెంబరు 10న ఎవరు బాధ్యతలు చేపట్టారు? (లండన్‌లోని సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌లో యాక్సెషన్‌ కౌన్సిల్‌ సమక్షంలో ఈయనకు 73 ఏళ్ల వయసులో రాజరికపు బాధ్యతలు అప్పగించారు)

జ: ప్రిన్స్‌ చార్లెస్‌-3

* యూఎన్‌డీపీ హెచ్‌డీఐ నివేదిక - 2021 ప్రకారం భారత్‌లో 1% మంది కుబేరుల చేతిలో దేశంలోని మొత్తం సంపదలో ఎంత శాతం కేంద్రీకృతమై ఉంది?            

జ: 21.7 శాతం

* హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరును ఏ రాష్ట్రంలోని సైనిక స్థావరానికి పెట్టారు? (ఈ రాష్ట్రంలోని కిబితు నుంచి పలాంగ్‌ వరకు 22 కి.మీ. రోడ్డుకు కూడా ఈయన పేరు పెట్టారు)  

జ: అరుణాచల్‌ ప్రదేశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts