కరెంట్‌ అఫైర్స్‌

కేంద్ర హోంశాఖ కార్యదర్శి పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో మూడోసారి ఏడాదిపాటు పొడిగించింది. కేంద్ర హోంశాఖ ప్రస్తుత కార్యదర్శి ఎవరు?

Published : 20 Nov 2022 01:08 IST

మాదిరి ప్రశ్నలు

కేంద్ర హోంశాఖ కార్యదర్శి పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో మూడోసారి ఏడాదిపాటు పొడిగించింది. కేంద్ర హోంశాఖ ప్రస్తుత కార్యదర్శి ఎవరు?

జ: అజయ్‌ కుమార్‌ భల్లా


క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన తొమ్మిది అంగుళాల టెర్రకోట బొమ్మ తాజాగా తెలంగాణలో ఎక్కడ లభ్యమైంది? (దీన్ని బుద్ధుడి కథల్లో ప్రాధాన్యమున్న బౌద్ధ హారీతి విగ్రహంగా పరిశోధకులు గుర్తించారు.)

జ: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ శివారులోని పాటిగడ్డ


ఏ అందాల పోటీల్లో వివాహితులు, మాతృమూర్తులు   పాల్గొనేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు?

జ: మిస్‌ యూనివర్స్‌ 2023 పోటీలు


భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అన్ని మ్యాచ్‌ల హక్కులను 2024-2027 కాలానికి దాదాపు రూ.24 వేల కోట్లకు వేలంలో ఏ సంస్థ దక్కించుకుంది?

జ: డిస్నీ స్టార్‌


ముఖ్యమంత్రి డిజిటల్‌ సేవ యోజన పథకం కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 1.35 కోట్ల మంది  మహిళలకు స్మార్ట్‌ఫోన్లు అందించాలని     నిర్ణయించింది? 

జ: రాజస్థాన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని