Online Course: ఆన్‌లైన్‌ కోర్సులకు విలువ ఉంటుందా?

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. ఐటీ రంగంలో ఉద్యోగం చేయాలనుంది. ఆన్‌లైన్‌ డేటాసైన్స్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు రెగ్యులర్‌ కోర్సులతో సమానంగా విలువ ఉంటుందా?

Updated : 23 Nov 2022 11:04 IST

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. ఐటీ రంగంలో ఉద్యోగం చేయాలనుంది. ఆన్‌లైన్‌ డేటాసైన్స్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు రెగ్యులర్‌ కోర్సులతో సమానంగా విలువ ఉంటుందా?

- వి.రమేష్‌

 డేటా సైన్స్‌ కోర్సును యూనివర్సిటీల్లో, కళాశాలల్లో రెగ్యులర్‌ డిగ్రీ/డిప్లొమా/సర్టిఫికెట్‌ కోర్సుగా అందించడం ఈమధ్య కాలంలోనే మొదలైంది. చాలా విద్యాసంస్థల్లో ఈ కోర్సును బోధించడానికి అవసరమైన అధ్యాపకుల కొరత ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం చాలామంది ఈ కోర్సును ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నేర్చుకొంటున్నారు. ప్రముఖ విద్యాసంస్థలనుంచి ఆన్‌   లైన్‌లో పొందే సర్టిఫికెట్‌లకు విలువ ఎక్కువగానే ఉంటుంది. రెగ్యులర్‌గా చదివినా, ఆన్‌లైన్‌లో చదివినా విషయపరిజ్ఞానం, సరైన నైపుణ్యాలు లేనట్లయితే ఆ సర్టిఫికెట్‌కు విలువ ఉండదు. మీకు అవకాశం ఉంటే అత్యుత్తమ విదేశీ యూనివర్సిటీలు, ఐఎస్‌బీ, ఐఐఎంలు, ఐఐటీల్లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో డేటా సైన్స్‌/ఎనలిటిక్స్‌ కోర్సును ఆఫ్‌లైన్‌/ ఆన్‌లై న్‌లో చేసే ప్రయత్నం చేయండి. డేటా సైన్స్‌/ ఎనలిటిక్స్‌ రంగాల్లో మెరుగైన ఉద్యోగం పొందాలంటే సర్టిఫికెట్‌తోపాటు అనుభవం కూడా ప్రధానం. మీరు కోర్సు నేర్చుకొంటూనే డేటా సైన్స్‌/ ఎనలిటిక్స్‌లో రకరకాల ప్రాజెక్టులు చేస్తూ అనుభవం, మెలకువలూ, నైపుణ్యాలను పొందండి: నచ్చిన సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని