కరెంట్‌ అఫైర్స్‌

తెలంగాణ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?  చంద్రుడిపై చైనా కనుక్కున్న కొత్త లోహానికి ఏ పేరు పెట్టారు? (చాంగే-5 మిషన్‌లో భాగంగా చంద్రుడిపై నుంచి తెచ్చిన రాయి, ధూళితో కూడిన మిశ్రమ నమూనాలను పరీక్షించి స్ఫటికాకార లోహాన్ని కనుక్కున్నారు...

Published : 23 Nov 2022 00:31 IST

మాదిరి ప్రశ్నలు

తెలంగాణ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?                    

 జ: చింతా ప్రభాకర్‌


చంద్రుడిపై చైనా కనుక్కున్న కొత్త లోహానికి ఏ పేరు పెట్టారు? (చాంగే-5 మిషన్‌లో భాగంగా చంద్రుడిపై నుంచి తెచ్చిన రాయి, ధూళితో కూడిన మిశ్రమ నమూనాలను పరీక్షించి స్ఫటికాకార లోహాన్ని కనుక్కున్నారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా దేశాలు చంద్రుడిపై కొత్త లోహాలను కనుక్కున్నాయి. ఇప్పుడు వాటి సరసన చైనా చేరింది)              

జ: చాంగేసైట్‌-వై


దిల్లీలోని కొత్త పార్లమెంట్‌ భవనానికి ఎవరి పేరు పెట్టాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది? 

జ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌


‘డూమ్స్‌ డే గ్లేసియర్‌’గా పేరు గాంచిన థ్వాయిట్స్‌ హిమానీ నదం ఏ ఖండంలో ఉంది? (గుజరాత్‌ పరిమాణంలో ఉన్న ఈ హిమానీ నదం వాతావరణ మార్పులతో వేగంగా కరిగిపోతూ వార్తల్లో నిలిచింది) 

జ: అంటార్కిటికా


తమ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది? 

జ: గోవా


ఆసియా కప్‌ టీ20 క్రికెట్‌ టోర్నీ 2022లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎవరు నిలిచారు?            

జ: హసరంగ, శ్రీలంక 


తెలంగాణ పవర్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీపీటీ డీసీఎల్‌) ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

జ: గూడూరి ప్రవీణ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని