కరెంట్‌ అఫైర్స్‌

ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షురాలిగా తిరిగి ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు?

Published : 29 Nov 2022 01:33 IST

మాదిరి ప్రశ్నలు

ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షురాలిగా తిరిగి ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు?

జ: సీమా ముస్తఫా


వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా పురస్కారం గెలుచుకున్న తెలంగాణ వాసి ఎవరు?

జ: ఎం.కరుణాకర్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌ (మురుగునీటి శుద్ధి, సామాజిక నీటి శుద్ధి ప్లాంట్లతో దేశంలోని వేల గ్రామాల్లో ప్రజల దాహార్తిని తీరుస్తున్నందుకు ముంబయికి చెందిన ప్రసిద్ధ గ్రీన్‌ మాపెల్‌ ఫౌండేషన్‌ సంస్థ ఈయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది)


తెలంగాణలో నేరాల దర్యాప్తులో నాణ్యతను పెంచేందుకు రాష్ట్ర పోలీసు శాఖ అమల్లోకి తెచ్చిన నూతన సాంకేతికత ఏది?

జ: సీసీటీఎన్‌ఎస్‌ (క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌) 2.0 వెర్షన్‌ (2022 అక్టోబరు 14న రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ మహేందర్‌ రెడ్డి సీసీటీఎన్‌ఎస్‌ 2.0 మొబైల్‌, వెబ్‌ వెర్షన్‌లను ఆవిష్కరించారు)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని