Published : 01 Dec 2022 00:05 IST

కరెంట్‌ అఫైర్స్‌

మాదిరి ప్రశ్నలు

యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించిన హైదరాబాద్‌ యువకుడు ఎవరు?

జ: భూక్య యశ్వంత్‌ నాయక్‌

హైదరాబాద్‌లో నిర్మించిన సంత్‌ సేవాలాల్‌ బంజారా భవన్‌, కుమురం భీమ్‌ ఆదివాసీ భవన్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ రోజున ప్రారంభించారు? 

జ: 2022, సెప్టెంబరు 17

2021 - 22 సంవత్సరానికి సంబంధించి కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ ప్రకారం తెలంగాణలోని ఎన్ని పట్టణాలు ఓడీఎఫ్‌++ ను సాధించాయి? (దీంతో పాటు రాష్ట్రంలోని మరో 70 పట్టణాలు ఓడీఎఫ్‌ ప్లస్‌ కేటగిరీలో చేరాయి) 

జ: 40

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? 

జ: సెప్టెంబరు 17

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన ‘హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఎకానమీ 2021-22’ ప్రకారం తెలంగాణలో 2015-16లో వరి దిగుబడి 30.47 లక్షల టన్నులు కాగా, 2021-22 నాటికి ఈ మొత్తం ఎంతకు చేరింది? (నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2015-16లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 51.29 లక్షల టన్నులు కాగా, 2021-22 నాటికి 150.95 లక్షల టన్నులకు పెరిగింది)

జ: 1.23 కోట్ల టన్నులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని