ఇండియన్‌ పాలిటీ ప్రాక్టీస్‌ బిట్లు

కిందివాటిలో ఇందిరాగాంధీకి సంబంధించి సరైంది?...

Published : 01 Dec 2022 00:08 IST

1. కిందివాటిలో ఇందిరాగాంధీకి సంబంధించి సరైంది?

ఎ) పదవిలో ఉండగా హత్యకు గురైన ప్రధాని.    
బి) పదవిలో ఉండగా మరణించిన మూడో ప్రధాని.  
సి) ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని రెండుసార్లు విధించారు.  
డి) ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానిగా చేసిన మొదటి మహిళ.
1) ఎ, సి, డి    2) ఎ, బి, డి  
3) ఎ, బి, సి    4) ఎ, బి, సి, డి

2. 1975లో జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు, అక్రమాలు, అధికార దుర్వినియోగం గురించి ఇందిరాగాంధీపై విచారణ కోసం ఏర్పడిన కమిటీ ఏది?

1) జె.సి.షా కమిటీ  2) డి.సి.చాగ్లా కమిటీ    
3) కె.ఎం.ఫణిక్కర్‌ కమిటీ  
4) టి.ఎం.ఎ.పాయ్‌ కమిటీ

3. మనదేశంలో ముఖ్యమంత్రి పదవి నిర్వహించి, తదనంతర కాలంలో ప్రధానమంత్రి పదవిని కూడా చేపట్టిన తొలివ్యక్తి?

1) ఇందిరాగాంధీ  2) మొరార్జీ దేశాయ్‌  
3) చరణ్‌సింగ్‌   4) లాల్‌బహదూర్‌ శాస్త్రి

4. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తిహక్కును ఎప్పుడు తొలగించింది?

1) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976      
2) 43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977  
3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978      
4) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1979

సమాధానాలు: 1-4, 2-1, 3-2, 4-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని