కరెంట్‌ అఫైర్స్‌

2022 అక్టోబరు 3న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నాలుగు ప్రచండ్‌ స్వదేశీ యుద్ధ హెలికాప్టర్లను ఎక్కడ జరిగిన కార్యక్రమంలో వాయుసేనలో ప్రవేశపెట్టారు? (ఈ హెలికాప్టర్లను ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసింది)

Published : 02 Dec 2022 01:18 IST

మాదిరి ప్రశ్నలు

* 2022 అక్టోబరు 3న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నాలుగు ప్రచండ్‌ స్వదేశీ యుద్ధ హెలికాప్టర్లను ఎక్కడ జరిగిన కార్యక్రమంలో వాయుసేనలో ప్రవేశపెట్టారు? (ఈ హెలికాప్టర్లను ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసింది)

జ: రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌

* ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను టైంబాంబులుగా ఏ బ్యాంకు నివేదిక అభివర్ణించింది? (ఉచిత హామీలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని, ఉచిత పథకాల ఖర్చును రాష్ట్ర జీడీపీలో ఒక శాతంగా లేదా ప్రభుత్వ సొంత పన్ను రాబడిలో ఒక శాతంగా ఉండేలా పరిమితి విధించాలని సుప్రీంకోర్టు నేతృత్వంలోని కమిటీకి ఈ బ్యాంకు తన నివేదికలో సూచించింది)

జ: భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ)

* 2024 చివరినాటికి అన్ని రకాల మొబైల్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, కెమెరాల్లో తప్పనిసరిగా ఒకే విధమైన టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్‌ అందుబాటులో ఉండాలని ఏ అంతర్జాతీయ సంస్థ ఒక చట్టాన్ని ఆమోదించింది? (ప్రపంచంలో ఇలాంటి చట్టాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి)    

జ: యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)

* 2022లో భారత ఆర్థిక వృద్ధి (జీడీపీ వృద్ధి) ఎంత శాతానికి పరిమితం అవుతుందని యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎన్‌సీటీఏడీ) నివేదిక అంచనా వేసింది? (2021లో ఈ వృద్ధిరేటు  8.2శాతంగా ఉంది. 2023లో భారత జీడీపీ వృద్ధిరేటు మరింతగా 4.7 శాతానికి పడిపోతుందని పేర్కొంది)

జ: 5.7 శాతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు