కరెంట్‌ అఫైర్స్‌

ఫైనాన్షియల్‌ టైమ్స్‌ టాప్‌ - 100 ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ - 2022 ర్యాంకింగ్స్‌లో దేశంలో అగ్రస్థానం పొందిన విద్యాసంస్థ ఏది?

Published : 07 Dec 2022 00:41 IST

మాదిరి ప్రశ్నలు

* ఫైనాన్షియల్‌ టైమ్స్‌ టాప్‌ - 100 ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ - 2022 ర్యాంకింగ్స్‌లో దేశంలో అగ్రస్థానం పొందిన విద్యాసంస్థ ఏది?
జ: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), హైదరాబాద్‌
* భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చరిత్రలోనే అత్యంత బరువైన రాకెట్‌ జీఎస్‌ఎల్‌వీ ఎంకే3ను ఏ రోజున విజయవంతంగా ప్రయోగించింది? (‘ఎల్వీఎం3-ఎం2’ అని కూడా ప్రస్తావించే ఈ రాకెట్‌ ఏకంగా 36 ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి వెళ్లింది)
   జ: 2022, అక్టోబరు 26

* వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులను పసిగట్టేందుకు గానూ సముద్ర గర్భంలోని శబ్దాలను రికార్డు చేసేందుకు సముద్రాల్లోని వివిధ ప్రాంతాల్లో మైక్రోఫోన్లను జారవిడిచి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఐరిష్‌ కళాకారిణి ఎవరు?
       జ: సియోభాన్‌ మెక్‌డొనాల్డ్‌
* యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని పోలిన ఆలయాన్ని ఇటీవల రూ.80 లక్షల ఖర్చుతో ఏ నగరంలో నిర్మించారు?
      జ: కోల్‌కతా


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని