కరెంట్‌ అఫైర్స్‌

దేశంలోనే తొలి కర్బన రహిత మూత్రశాలను నిర్మించిన పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన యువతి ఎవరు? (4 లక్షల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాగులతో ఇటుకలు తయారు చేసి, అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టులో ఓ టాయిలెట్‌ను నిర్మించి దానికి ‘టాయిలెట్‌ 01’గా పేరు పెట్టింది)

Published : 10 Dec 2022 01:17 IST

మాదిరి ప్రశ్నలు

* దేశంలోనే తొలి కర్బన రహిత మూత్రశాలను నిర్మించిన పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన యువతి ఎవరు? (4 లక్షల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాగులతో ఇటుకలు తయారు చేసి, అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టులో ఓ టాయిలెట్‌ను నిర్మించి దానికి ‘టాయిలెట్‌ 01’గా పేరు పెట్టింది)

జ: రుహానీ వర్మ

* ప్రపంచం మొత్తంమీద అప్పులు లేని ప్రదేశాలుగా గుర్తింపు పొందిన ప్రాంతాలు ఏవి?

జ: ఇంగ్లిష్‌ ఛానల్‌లోని జెర్సీ ద్వీపం, అమెరికాలోని గెరన్సే పట్టణం, ఆసియాలోని హాంకాంగ్‌

* ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2023 సంవత్సరాన్ని ఏమని ప్రకటించింది?

జ: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం

* 2022, అక్టోబరు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన ‘ఎయిమ్స్‌’ (ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇది దేశంలో ఏర్పాటుచేసిన ఎన్నో ఎయిమ్స్‌?            

జ: 23వ

* అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, భారతీయ ఇంగ్లిష్‌ దినోత్సవాలను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?  

జ: అక్టోబరు 5


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని