కరెంట్‌ అఫైర్స్‌

వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, అటవీ భూముల సంరక్షణకు పాటుపడేందుకు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు రూ.24 వేల కోట్ల విలువైన తన వాటాలు, కుటుంబ వాటాలన్నింటినీ ఓ స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేసిన అమెరికా బిలియనీర్‌ ఎవరు?

Published : 10 Dec 2022 02:55 IST

మాదిరి ప్రశ్నలు

* వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, అటవీ భూముల సంరక్షణకు పాటుపడేందుకు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు రూ.24 వేల కోట్ల విలువైన తన వాటాలు, కుటుంబ వాటాలన్నింటినీ ఓ స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేసిన అమెరికా బిలియనీర్‌ ఎవరు? (ఈయన పెటగోనియా ఫ్యాషన్‌ సంస్థ ఫౌండర్‌)

 జ: యోవోన్‌ చుయ్‌ నార్డ్‌

* స్మార్ట్‌ గ్రామ పంచాయతీలు - గ్రామీణ సాధికారత అనే అంశంపై 2022 సెప్టెంబరు 15, 16 తేదీల్లో రెండురోజుల పాటు జాతీయ సదస్సును కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ఏ నగరంలో నిర్వహించింది?        

జ: లఖ్‌నవూ

* ఆక్స్‌ఫామ్‌ ఇండియా రూపొందించిన ‘ఇండియా డిస్క్రిమినేషన్‌ రిపోర్ట్‌ - 2022’ ప్రకారం ఉపాధి పొందడంలో పురుషులతో పోలిస్తే మహిళలు గ్రామాల్లో ఎంత శాతం లింగ భేదాన్ని ఎదుర్కొంటున్నారు?

జ: 100 శాతం (పట్టణాల్లో ఇది 98 శాతంగా ఉంది)

* 2022 సెప్టెంబరులో ఏ దేశ చట్టసభ ‘పీరియడ్‌ ప్రొడక్ట్‌ బిల్‌’ను ఆమోదించింది? (ఈ బిల్లు ప్రకారం దేశంలోని మహిళలందరికీ శానిటరీ న్యాప్‌కిన్‌లను ఉచితంగా ఇస్తారు)    

జ: స్కాట్లాండ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని