కరెంట్‌ అఫైర్స్‌

పీలే (ఈయన మూడు ప్రపంచకప్‌ విజేత జట్లలో భాగమైన ఏకైక ఫుట్‌బాలర్‌గా ఖ్యాతి గడించారు)

Published : 12 Jan 2023 01:26 IST

మాదిరి ప్రశ్నలు

* ఇటీవల మరణించిన బ్రెజిల్‌కు చెందిన సాకర్‌ దిగ్గజం ఎవరు?
జ: పీలే (ఈయన మూడు ప్రపంచకప్‌ విజేత జట్లలో భాగమైన ఏకైక ఫుట్‌బాలర్‌గా ఖ్యాతి గడించారు)

* భద్రతా మండలిలో కొత్తగా చేరిన అయిదు సభ్య దేశాలు ఏవి?
జ: జపాన్‌, స్విట్జర్లాండ్‌, మొజాంబిక్‌, ఈక్వెడార్‌, మాల్టా (ఈ దేశాలు రెండేళ్ల పాటు సభ్యులుగా ఉంటాయి. 2022, డిసెంబర్‌ 31తో భారత్‌, ఐర్లాండ్‌, కెన్యా, మెక్సికో, నార్వే దేశాల సభ్యత్వం ముగియడంతో కొత్త సభ్య దేశాలు చేరాయి. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు శాశ్వత సభ్య దేశాలు.)

* ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు?
జ: బెంజమిన్‌ నెతన్యాహు (73) (ఈయన ఆరోసారి ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు)

* 2023-25 సంవత్సరాలకు గానూ పాటించే మధ్యకాలిక వ్యూహ ప్రణాళికను ఏ పేరుతో ప్రారంభించారు?
జ: ఉత్కర్ష్‌ 2.0 (ఆర్‌బీఐ ప్రాధాన్యత అంశాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సిన ఫలితాలు దీనిలో ఉంటాయి. 2019-2022 మధ్యకాలంలో తొలి ఉత్కర్ష్‌ను అమలు చేశారు)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని