కరెంట్‌ అఫైర్స్‌

మహిళలపై హింసకు  వ్యతిరేకంగా నిర్వహించే  అంతర్జాతీయ దినోత్సవం (నవంబరు 25) సందర్భంగా 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సరికొత్త ప్రచార కార్యక్రమం ఏది?  

Published : 13 Jan 2023 00:23 IST

మాదిరి ప్రశ్నలు

మహిళలపై హింసకు  వ్యతిరేకంగా నిర్వహించే  అంతర్జాతీయ దినోత్సవం (నవంబరు 25) సందర్భంగా 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సరికొత్త ప్రచార కార్యక్రమం ఏది?  

జ: నయీ చేతన


‘హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ సైన్స్‌ అండ్‌    టెక్నాలజీ’ పేరిట ఓ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏ రెండు సంస్థలు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి?

జ: ఐసీహెచ్‌ఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌), ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)


2022 యునెస్కో ఆసియా పసిఫిక్‌ పురస్కారాల్లో భాగంగా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేసినందుకు ఏ భారత సంస్థ ఎక్స్‌లెన్స్‌ అవార్డును గెలుచుకుంది?

జ: ఛత్రపతి శివాజీ మహరాజ్‌ వాస్తు సంగ్రహాలయ, ముంబయి (ఈ సంస్థను 1922లో ఏర్పాటు చేశారు)


‘డూయింగ్‌ బిజినెస్‌ ఇన్‌ ఇండియా’ నివేదికను 2022 నవంబరులో ఏ సంస్థ విడుదల చేసింది? (ఈ నివేదిక ప్రకారం పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది)

జ: యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూకేఐబీసీ) 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని