కరెంట్‌ అఫైర్స్‌

2023 భారత ప్రభుత్వ అధికారిక క్యాలెండర్‌ను ఏ థీమ్‌ ఆధారంగా రూపొందించారు?

Published : 23 Jan 2023 01:54 IST

మాదిరి ప్రశ్నలు

* 2023 భారత ప్రభుత్వ అధికారిక క్యాలెండర్‌ను ఏ థీమ్‌ ఆధారంగా రూపొందించారు?

జ: నయా వర్ష్‌, నయీ సంకల్ప్‌

* విజయ్‌ హజారే ట్రోఫీ 2022 విజేతగా ఏ జట్టు నిలిచింది? (అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఈ జట్టు 5 వికెట్ల తేడాతో మహారాష్ట్ర జట్టుపై నెగ్గింది.) 

జ: సౌరాష్ట్ర

* ప్రతిష్ఠాత్మక టైమ్స్‌ మ్యాగజైన్‌ ‘హీరోస్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారంతో ఎవరిని గౌరవించింది? (అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా అమెరికా బేస్‌బాల్‌ క్రీడాకారుడు ఆరోన్‌ జడ్జ్‌, ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మలేసియా నటి మిచెల్లి యోహ్‌ ఎంపికయ్యారు.)

జ: ఇరాన్‌ మహిళలు

* గ్యాస్‌ ధరలకు సంబంధించి ఏ కమిటీ ఇటీవల తన నివేదికను కేంద్ర  ప్రభుత్వానికి సమర్పించింది?  

జ: కిరీట్‌ పారిఖ్‌ కమిటీ

* 2022 డిసెంబరులో ముంబయిలో 25వ  చంద్రశేఖర సరస్వతి నేషనల్‌ ఎమినెన్స్‌ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?

జ: మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు

* 2022, అక్టోబరు 1న అంతర్జాతీయ వృద్ధుల  దినోత్సవాన్ని ఏ థీమ్‌తో నిర్వహించారు? (1990, డిసెంబరు 14న ఐక్యరాజ్యసమితి సాధారణసభ అక్టోబరు 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది.)

జ: రిసిలియన్స్‌ ఆఫ్‌ ఓల్డర్‌ పర్సన్స్‌ ఇన్‌ ఎ ఛేంజింగ్‌ వరల్డ్‌

* 2022 సంవత్సరానికి గానూ పెటా(శినిగితి పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌) సంస్థ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాన్ని ఏ బాలీవుడ్‌ నటికి ప్రదానం చేసింది? (2021లో ఈ పురస్కారాన్ని అలియాభట్‌కు ప్రదానం చేశారు.)

జ: సోనాక్షి సిన్హా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని